కోటపల్లి, మార్చి 20 : తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులోని మావోయిస్టు ప్రభావిత గ్రామాల్లో ఉన్న పోలింగ్ కేంద్రాలను మంచిర్యాల డీసీపీ అశోక్ కుమార్ బుధవారం పరిశీలించారు. అన్నారం పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన డీసీపీ, భద్రతా చర్యలపై ఆరా తీశారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు.
అనంతరం రాపనపల్లి సమీపంలోని అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు వద్దకు చేరుకొని, ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయడంతో పాటు అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి సూచించారు. జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, చెన్నూర్ రూరల్ సీఐ సుధాకర్ ఉన్నారు.