నార్నూర్ : ఆదిలాబాద్ జిల్లా అన్నాబావు సాఠే జిల్లా అధ్యక్షుడు, బీఆర్ ఎస్ జిల్లా నాయకుడు కాంబ్లే ఉద్ధవ్( Kamble Uddav ) గురువారం దళిత రత్న అవార్డు ( Dalit Ratna Award ) ను అందుకున్నారు.హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో జరిగిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్.బీఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా జయంతి ఉత్సవ వైస్ చైర్మన్ బైరి వెంకటేశం చేతుల మీదుగా దళిత రత్న అవార్డును అందుకున్నట్టు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో అన్న బావు సాఠే అసోసియేషన్ నాయకులు సూర్య వంశీ కైలాష్, తల్వారే పరమేశ్వర్, సత్యం సాగోరే, గణేష్, మధుకర్ తదితరులున్నారు.