దండేపల్లి, జూలై 22: ‘పెద్దపల్లి ఎంపీగా ఈ నియోజకవర్గానికి ఏం చేశావో చెప్పాలి’ అని పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణను దళిత సంఘాల నాయకులు ప్రశ్నించారు. దండేపల్లి మండలంలోని ముత్యంపేటలో బుధవారం ఎంపీ వైఖరికి నిరసనగా దళిత సంఘాల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వారిని వెంట బెట్టుకొని తిరగడం సమంజసం కాదన్నారు.
నియోజకవర్గంలో గ్రూపు రాజకీయాలు చేయడం తగదన్నారు. సొంత పార్టీ కార్యకర్తలను అడ్డుకోవడం భావ్యం కాదన్నారు. గ్రూపు రాజకీయాలు తమ వ్యక్తిగత పెత్తనం కోసమే కానీ పార్టీ అభివృద్ధికి కాదని మండిపడ్డారు. ఇప్పటికైనా గ్రూపు రాజకీయాలు మానుకొని నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టిపెట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ అధ్యక్షుడు ప్రేంచంద్, అంబేద్కర్ సంఘం మండల అధ్యక్షుడు ఎల్.బాపు, రాందాస్, దొంత నర్సయ్య, సర్పంచ్లు భానేష్, రాందాస్, రాజేశ్, రాజేశ్వర్నాయక్, సత్యనారాయణ, శంకరమ్మ, నాయకులు బండ రాకేశ్, నవీన్, దావీదు, వెంకటేశ్, తదితరులున్నారు.