RGUKT | బాసర : ఆర్జీయూకేటిలో సైబర్ భద్రతపై అవగాహన కార్యక్రమాన్ని ఐసీఐసీఐ బ్యాంక్ అధికారులచే నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపకులపతి ప్రొఫెసర్ వి. గోవర్ధన్ పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు, సిబ్బందిలో సైబర్ భద్రతపై అవగాహన పెరిగిందని, భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని కార్యక్రమాలను నిర్వహించేందుకు వర్సిటీ కృషి చేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో డిజిటల్ మోసాలు, సైబర్ భద్రతపై సమగ్ర అవగాహన కల్పించబడింది.
రీజినల్ మేనేజర్ రామారావు మాట్లాడుతూ.. APK ఫైళ్ల ద్వారా వచ్చే మోసాలు, సందేహాస్పద లింకులు, OTP మోసాలు, ఫిషింగ్, గ్రిడ్ టెక్నిక్స్, బ్యాంక్ ఖాతాల హ్యాకింగ్ వంటి వాటిపై జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. అవగాహన లేకుండా సందేహాస్పద లింకులను ఓపెన్ చేయడం వల్ల వ్యక్తిగతంగా మోసపోవచ్చని హెచ్చరించారు.
కార్యక్రమంలో భాగంగా జోనల్ డైరెక్టర్ సత్యపాల్ రెడ్డి, దీపక్ మల్హోత్రా మాట్లాడుతూ.. ICICI 3-in-1 డిజిటల్ కార్డు గురించి కూడా వివరించబడింది. ఇది సేవింగ్స్ అకౌంట్, ట్రేడింగ్ అకౌంట్, డీమాట్ అకౌంట్ లను ఒకే ప్లాట్‌ఫారమ్‌లో అందించడంతో పాటు, భద్రమైన డిజిటల్ లావాదేవీలకు తోడ్పడుతుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐసిఐసిఐ బ్యాంక్ సిబ్బంది శ్రీనివాస్, అసోసియేట్ డీన్లు డా. విట్టల్, డా. నాగరాజు, చీఫ్ వార్డెన్ శ్రీ మధుసూధన్ రెడ్డి అధ్యాపకులు, ఉద్యోగులు పాల్గొన్నారు.