PRTU | కోటపల్లి, ఆగస్టు 2 : కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు సీపీఎస్ రద్దు చేసి ఉద్యోగులకు, ఉపాద్యాయులకు పాత ఫెన్షన్ విదానం అమలు చేయాలని పీఆర్టీయూ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు కొట్టె శంకర్ డిమాండ్ చేశారు. కోటపల్లి మండలకేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పీఆర్టీయూ సభ్యత్వం నిర్వహించిన అనంతరం కొట్టె శంకర్ మాట్లాడారు.
40 సంవత్సరాల పాటు పని చేసిన ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఫెన్షన్ లేకపోతే ఏ విదంగా జీవనం కొనసాగిస్తారని ప్రశ్నించారు. పీఆర్టీయూ సీపీఎస్ రద్దు కోసం 20 ఏళ్ళుగా పోరాటం చేస్తుందని, సీపీఎస్ రద్దు చేసి పాత ఫెన్షన్ విధానం పునరుద్ధరణ జరిగే వరకు పీఆర్టీయూ పోరాటం ఆపదని పేర్కొన్నారు.
రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సెప్టెంబర్ 1న హైదరాబాద్ లోని ఇందిరాపార్క్ వద్ద వేలాది మంది ఉద్యోగ, ఉపాద్యాయులతో నిర్వహించే మహాధర్నాకు పెద్ద సంఖ్యలో ఉద్యోగ, ఉపాద్యాయులు తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం కృష్ణమూర్తి, పీఆర్టీయూ రాష్ట్ర ఆసోసియేట్ అధ్యక్షులు బిల్ల తిరుపతయ్య, మండల ప్రదాన కార్యదర్శి కోమట్ల బాపు, ఉపాధ్యక్షులు వారణాసి నాగేందర్, ఉపాధ్యాయులు చంద్రయ్య, కరీం, శ్రీదేవి, సంతోష్, శ్రీనివాస్, గంగాధర్, వరలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.