తాండూర్ : తాండూర్ సర్కిల్ పోలీస్ స్టేషన్ల ల పరిధిలో ఉన్న రౌడీషీటర్లకు(Rowdy sheeters) సీఐ దేవయ్య( CI Devaiah) గురువారం కౌన్సిలింగ్ (Counseling ) ఇచ్చారు. రామగుండం కమిషనర్ ఆఫ్ పోలీస్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రౌడీ షీటర్లతో సమావేశమై నేరాలకు దూరంగా ఉంటూ సత్పవర్తన ఉంటే అధికారుల సూచనల ప్రకారం రౌడీ షీట్ తొలగిస్తామని అన్నారు.
భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మారాలని హితవు పలికారు. నేరప్రవృత్తిని మార్చుకోవడానికి ఒక అవకాశం ఇస్తున్నామని, ఒకవేళ మారకపోతే కఠినంగా వ్యవహరించాల్సి వస్తుందని హెచ్చరించారు. రౌడీ షీట్ ఉన్న ప్రతీ ఒక్కరిపై ప్రత్యేక నిఘా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తాండూర్ ఎస్సై కిరణ్ కుమార్ ఉన్నారు.