ఆదిలాబాద్ : జిల్లాలో ఈనెల 20 నుంచి పత్తి కొనుగోలు ప్రారంభించనున్నట్లు కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో ఎమ్మెల్యేలు జోగు రామన్న , బాపురావు సీసీఐ అధికారులు ప్రైవేటు వ్యాపారులు రైతు సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించారు.
జిల్లాలో ఈ ఏడాది 390000 ఎకరాల్లో పత్తి 27 లక్షల క్వింటాళ్ల దిగుబడి వచ్చే అంచనా ఉందన్నారు.
బహిరంగ మార్కెట్లో పత్తి క్వింటాలకు రూ.7500 వరకు ఉండగా వ్యాపారులు రైతుల వద్ద నుంచి కొనుగోలు చేయాలని సూచించారు.. సీసీఐ జిల్లా వ్యాప్తంగా మార్కెట్ యార్డులో కనీస మద్దతు ధర రూ. 6025 కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. వచ్చే సీజర్ నుంచి పంట దిగుబడులు ప్రారంభంకాగానే కొనుగోలు ప్రారంభించాలని ఎమ్మెల్యే జోగు రామన్న వ్యాపారులకు సూచించారు.