పత్తి కొనాల్సిందే..
అసలైన రైతుల పత్తి పంటను ఎడ్లబండ్లలో తీసుకొస్తే సీసీఐ అధికారులు కొనుగోలు చేయడానికి నిరకరిస్తున్నారని, దీంతో వ్యాపారస్తులకు తక్కువ ధరకే పత్తి అమ్మి ఆర్థికంగా నష్టపోతున్నామని రైతులు మంగళవారం ఆందోళనకు దిగారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని సమక ఎక్స్‌రోడ్డులో గల మిత్తల్ జిన్నింగ్ మిల్లు లో సీసీఐ కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
- సీసీఐకి పత్తి రైతుల డిమాండ్
- కొనకపోవడంతో అన్నదాతల రాస్తారోకో
- నిలిచిన వాహనాలు.. ట్రాఫిక్‌కు అంతరాయం
- అధికారుల హామీతో ఆందోళన విరమణ
ఇంద్రవెల్లి, ఫిబ్రవరి 17 : అసలైన రైతుల పత్తి పంటను ఎడ్లబండ్లలో తీసుకొస్తే సీసీఐ అధికారులు కొనుగోలు చేయడానికి నిరకరిస్తున్నారని, దీంతో వ్యాపారస్తులకు తక్కువ ధరకే పత్తి అమ్మి ఆర్థికంగా నష్టపోతున్నామని రైతులు మంగళవారం ఆందోళనకు దిగారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని సమక ఎక్స్‌రోడ్డులో గల మిత్తల్ జిన్నింగ్ మిల్లు లో సీసీఐ కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మంగళవారం మండలంలోని కేస్లాపూర్ గ్రామ పం చాయతీ పరిధిలోని కేస్లాగూడ(జీ) గ్రామానికి చెందిన రైతులు మెస్రం భీంరావ్, మెస్రం మోతీరాంలు పత్తిని విక్రయించడానికి తీసుకొచ్చారు.
ఆ పత్తిని కొనుగోలు చేయడానికి సీసీఐ అధికారులు నిరాకరించారు. కొనుగోలు చేయాలని విన్నవించిన అధికారు లు కొనుగోలు చేయకపోవడంతో రైతులు పత్తి ఎడ్లబండ్లతో రాస్తారోకో నిర్వహించారు. సుమారు 40 ని మిషాలపాటు రాస్తారోకో నిర్వహించడంతో రోడ్డుకు ఇరువైపుల వాహనాలు నిలిచాయి. విషయం తెలుసుకొన్న ఇంద్రవెల్లి ఎస్ఐ సాయన్న ఘటన స్థలానికి చేరుకొని రైతులకు నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు. అనంతరం పత్తి ఎడ్లబండ్లను కొనుగోలు కేంద్రానికి తరలించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. సీసీఐ కొనుగోలు కేంద్రంలో అసలై న రైతులకు అన్యాయం జరుగుతున్నదని, జిల్లా అధికారులు దృష్టి సారించి పత్తి పంటను కొనుగోలు చేసే లా కృషి చేయాలని రైతులు కోరుతున్నారు. పంటలో నాణ్యత లేకపోవడంతోనే కొనుగోలు చేసేందుకు నిరాకరిస్తున్నామని సీసీఐ అధికారులు తెలిపారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
- Tags
- CCI
- cotton farmers
- farmers
RELATED ARTICLES
తాజా వార్తలు
Mythri Movie Makers | మైత్రీ మూవీ మేకర్స్ నుంచి మరో రొమాంటిక్ కామెడీ.. డెబ్యూ ఇస్తున్న శ్రీకాంత్ కుమార్తె
IAS Transfers | ఏపీలో పలువురు ఐఏఎస్‌ల బదిలీ.. పర్యాటక శాఖ కార్యదర్శిగా ఆమ్రపాలికి పోస్టింగ్!
Chiranjeevi | చిరంజీవి ‘కాకా’ సినిమాలో బాలయ్య కుమార్తె తేజస్విని.. బాబీ సంప్రదించడంపై భరత్ ఏమన్నారంటే!
Nagarjuna Sagar | నాగార్జునసాగర్ డ్యాం ఎడమ కాలువకు నీటి విడుదల చేసిన ఎన్ఎస్పీ అధికారులు
Varanasi | ‘వారణాసి’లో రామాయణ ఘట్టమే హైలైట్.. రాజమౌళి స్వయంగా తీసుకున్న సవాల్ ఇదే!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

