సీసీసీ నస్పూర్, అక్టోబర్ 11: నస్పూర్‌లోని మంచిర్యాల కోర్టు భవన నిర్మాణ పనులను శనివారం అట్టహాసంగా ప్రారంభించారు. రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి, మంచిర్యాల జిల్లా అడ్మినిస్ట్రేషన్ జడ్జి భీమపాక నగేశ్ హాజరు కాగా, మంచిర్యాల జిల్లా ప్రధాన న్యాయమూర్తి వీరయ్య, కలెక్టర్ కుమార్ దీపక్, డీసీపీ ఎగ్గడి భాస్కర్, జిల్లా న్యాయమూర్తులు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బండవరం జగర్, న్యాయవాదులు ఆయనకు ఘనస్వాగతం పలికారు.
మంచిర్యాల ఇంటిగ్రేటెడ్ భవన నిర్మాణాన్ని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆపరేష్ కుమార్‌సింగ్, పలువురు హైకోర్టు న్యాయమూర్తులతో కలిసి హైదరాబాద్ నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. కోర్టు భవన సముదాయ నిర్మాణ ప్రారంభోత్సవానికి కృషి చేసిన వారందరినీ చీఫ్ జస్టిస్ అభినందించారు. అంతకుముందు హైకోర్టు జస్టిస్ భీమపాక నగేశ్, కలెక్టర్, డీసీపీ, న్యాయమూర్తులతో కలిసి గోపూజా, సర్వమత ప్రార్థనలు చేశారు. శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం కోర్టు భవన సముదాయ నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా గోండు కళాకారుల గుస్సాడీ నృత్యా లు, కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.
ఒకే చోట న్యాయసేవలు : జస్టిస్ భీమపాక నగేశ్
మంచిర్యాల కోర్టు భవన నిర్మాణం పూర్తయితే ఒకేచోట న్యాయసేవలు అందుబాటులోకి రానున్నాయని హైకోర్టు జస్టిస్ భీమపాక నగేశ్ పేర్కొన్నారు. మంచిర్యాలలో కోర్టు భవన స ముదాయం అందుబాటులోకి రావడానికి అ నేక మంది కృషి చేశారని, ఇందుకోసం కష్టపడిన వారు ఉద్వేగానికి గురై కళ్లలో నీళ్లు రావ డం చూసి తాను ఆశ్చర్యానికి గురైనట్లు చెప్పా రు. 20 నెలల్లో కోర్టు భవన నిర్మాణం పూర్తి చేసేలా చూడాలని అధికారులకు సూచించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ కోర్టు భవనాలతో ప్రజలకు న్యాయ సేవలు మరింత చేరువవుతాయన్నారు.
ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి నిర్మల, అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జి రాంమోహన్‌రెడ్డి, రెండో అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి నిరోష, లక్షెట్టిపేట జూనియర్ సివిల్ జడ్జి సాయికిరణ్, బెల్లంపల్లి జూనియర్ సివిల్ జడ్జి ముఖేశ్, చెన్నూర్ జూనియర్ సివిల్ జడ్జి రవి, మంచిర్యాల బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బీ జగన్, జిల్లా అటవీ శాఖ అధికారి శివ్ ఆశీష్, ఆర్డీవో శ్రీనివాస్‌రావు, బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు భూజంగరావు, ప్రధాన కార్యదర్శి మురళీకృష్ణ, కోశాధికారి దత్తాత్రేయ, సత్తయ్య, వే ణుకుమార్, రంజిత్‌కుమార్, ప్రదీప్, శ్రీకాం త్, సింధూజ, లక్ష్మీప్రసన్న పాల్గొన్నారు.