ఖానాపూర్ టౌన్, ఫిబ్రవరి 9 : ఖానాపూర్‌కు మంజూరైన ఇంటిగ్రేటెడ్ పాఠశాలను ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్‌కు తరలించిన కాంగ్రెస్ పార్టీకి మున్సిపల్ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని ఇంటిగ్రేటెడ్ పాఠశాల సాధన జేఏసీ నాయకులు ఖానాపూర్ ఓటర్లకు పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మె ల్యే బొజ్జు పటేల్ ఉద్దేశ పూర్వకంగా ఇక్కడి ప్రాంతం నుంచి ఊట్నూర్ తరలించడంలో తన ప్రమేయం లేదని తాను గుడిలో ప్రమాణం చేస్తానని ప్రకటించారని జేఏసీ నాయకులు గుర్తు చేశారు.
అందులో భాగంగానే సోమవారం శాంతినగర్ కాలనీలోని ముత్యాల పోచమ్మ అలయానికి వచ్చి ఎమ్మెల్యే ప్రమాణం చేయాలని కోరారు. ముందుగా జేఏసీ నాయకులు అలయానికి చేరుకొని స్నానం చేసి తడిబట్టలతో తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ కన్వీనర్ రామయ్య, జేఏసీ నాయకులు సాగి లక్ష్మణ్‌రావు, కొండా డి గంగారావు, కాశవేణి ప్రణయ్, మంత్రరాజ్యం సురేశ్, బుచ్చన్న, ఐదు వెంకటేశ్, సందుపట్ల శ్రావణ్, సల్ల నరేందర్, శంకర్, సిద్ధార్థ పాల్గొన్నారు.