రామకృష్ణాపూర్, మే 1: హామీలు ఇచ్చి విస్మరించిన కాంగ్రెస్ పార్టీకి చురుకు తగలాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేయాలని ప్రజలను చెన్నూరు మాజీ శాసన సభ్యుడు, మంచిర్యాల జీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బాల్క సుమన్ కోరారు. బుధవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా పెద్దపల్లి పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌కు మద్దతుగా క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని రామకృష్ణాపూర్ 3,4, 19, 20 వార్డుల్లో ఇంటింటా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మాజీ విప్ మాట్లాడుతూ క్యాతనపల్లి మున్సిపాలిటీకి రూ.25 కోట్ల ఎస్డీఎఫ్ నిధులు తీసుకువస్తే నిలుపుదల చేశారని, సమీకృత మార్కెట్, పార్కులు నిర్మాణాలు ఆగిపోయాయని, తాగునీరు, సాగునీటికి ప్రజలు గోసపడుతున్నారని తెలిపారు. రెండు లక్షల రుణమాఫీ అని రైతులను, రూ.2500 ఆర్థిక సాయం ఇస్తామని మహిళలను మోసం చేశారని విమర్శించారు. హామీలను విస్మరించిన కాంగ్రెస్‌కు ప్రజలు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఇన్చార్జి గాండ్ల సమ్మయ్య, సీనియర్ నాయకులు రాజారమేశ్బాబు, రామిడికుమార్, పచ్చిక లక్ష్మారెడ్డి, ఎండీ రహీమ్,కౌన్సిలర్లు రేవెల్లి ఓదెలు, బోయినపల్లి అనిల్‌రావు, జాడి శ్రీనివాస్, జిలకర మహేశ్, జంజుపెల్లి శశికుమార్, సాంబర్ శేఖర్, నందెల్లి లలిత,లింగం మాధవి, గోనె రాజేందర్, చంద్రకిరణ్, జాన్ రాజు, రమేశ్‌రెడ్డి, నాలుగు వార్డుల ప్రజలు పాల్గొన్నారు.
ఈ నెల 4న సాయంత్రం మంచిర్యాల జిల్లాలోని ఐబీ చౌరస్తా కేసీఆర్ రోడ్ షోను విజయవంతం చేయాలని మాజీ విప్ బాల్క సుమన్ బొక్కలగుట్ట గ్రామస్తులను కోరారు. బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌కు మద్దతుగా మందమర్రి మండలంలోని బొక్కలగుట్ట గ్రామంలో రైతు బంధు సమితి మందమర్రి మండల కో-ఆర్డినేటర్ బలికొండ కిషన్ ఇంటి వద్ద బొక్కలగుట్ట, పులిమడుగు, అందుగులపేట గ్రామాల బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, ముఖ్య కార్యకర్తలు, గ్రామ పెద్దలతో సమావేశం నిర్వహించారు. బీఆర్ఎస్ను గెలిపించాలని గ్రామస్తులను కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాజారమేశ్, రైతు బంధు సమితి కో-ఆర్డినేటర్ బలికొండ కిషన్, పంగ శ్రీధర్, మారుపాక రాజయ్య, రవినాయక్ ప్రజలు పాల్గొన్నారు.
మందమర్రి, మే 1 : జాతీయ పార్టీలు వాటి అనుబంధ జాతీయ కార్మిక సంఘాలు సింగరేణిలో ఏనాడో రద్దు చేయించిన డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ పథకాన్ని తిరిగి మెడికల్ ఇన్వాలిడేషన్ కారుణ్య నియామకాల పేరిట అమలు చేయించిన ఘనత తెలంగాణ తొలి సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని మాజీ విప్, బీ ఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ అ న్నారు. మందమర్రిలోని టీబీజీకేఎస్ కార్యాలయం వద్ద బుధవారం నిర్వహించిన మేడే వేడుకల్లో ఆయన పాల్గొని పతాకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. సాధ్యం కాని హామీలతో అబద్ధ్దపు ప్రచారాలతో అధికారం చేపట్టిన కాంగ్రెస్ కారుణ్య నియామక పత్రాలను హైదరాబాద్‌లో అందజేసి గొప్ప పని చేసినట్లు ఆ పార్టీ నాయకులు చెప్పుకుంటున్నారని ఆయ న విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో సింగరేణి కార్మికుల పోరాట పటిమను గుర్తిం చి కేసీఆర్ ప్రత్యేక ఇంక్రిమెంట్ ఇచ్చి గౌరవించారని గుర్తు చేశారు. బీఆర్ఎస్ అనుబంధ టీబీజీకేఎస్ ప్రభుత్వ సహకారంతో అనేక హ క్కులను సాధించిందని చెప్పారు. కేసీఆర్ చేసి న మేలును కార్మికులకు వివరించి పార్లమెంట్ ఎన్నికల్లో మద్దతు కోరాలని, బీఆర్ఎస్ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని టీబీజీకేఎస్ నాయకులు, కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యుడు వేల్పుల రవి, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జే.రవీందర్, డాక్టర్ రాజారమేశ్, టీబీజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు మేడిపల్లి సంపత్, బీఆర్ఎస్, టీబీజీకేఎస్ సీనియర్ నాయకులు ఓ.రాజశేఖర్, బడికెల సంపత్, కొంగల తిరుపతి రెడ్డి, ఎండీ అబ్బాస్, బోరిగం వెంకటేశ్, మద్ది శంకర్, ఎంవీ.గుణ, మంద వేణుగోపాల్ రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.