ఇచ్చోడ, జూన్ 28 : తులం బంగారం పేరిట మహిళలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. శనివారం మండల కేంద్రంలో నిర్వహించిన చెకుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఇచ్చోడ, సిరికొండ మండలాల్లోని ఆయా గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు రూ.1,00,116 చొప్పున 70 మందికి చెకులను అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఇచ్చోడ, సిరికొండ తహసీల్దార్లు సత్యనారాయణ, తుకారం, బీఆర్ఎస్ ఇచ్చోడ మండలాధ్యక్షులు కృష్ణారెడ్డి, మాజీ ఎంపీటీసీ గాడ్గె సుభాష్, మాజీ ఉప సర్పంచ్ శిరీష్‌రెడ్డి, మాజీ సర్పంచ్‌లు పెంటన్న, రోహిదాస్, సూర్యకాంత్ పాల్గొన్నారు. అలాగే తహసీల్దార్ కార్యాలయంలో రాయితీపై వచ్చిన ఎల్‌ఆర్‌జీ కంది విత్తనాల బ్యాగులను ఎమ్మెల్యే అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏవో భగవత్ రమేశ్, ఏఈవోలు సంజీవ్, ఉదయ్, తదితరులు పాల్గొన్నారు.