భీంపూర్, ఏప్రిల్ 11 : హామీలు అమలు చేయని కాంగ్రెస్ పాలనతో విసిగి, గత కేసీఆర్ పాలనను గుర్తు చేసుకుంటూ, బోథ్ నియోజకవర్గంలో ప్రగతిని చూసి కాంగ్రెస్ పార్టీ నుంచి నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరుతున్నారని బోథ్ ఎమ్మెల్యే అనిల్‌జాదవ్ అన్నారు. నేరడిగొండలో ఎమ్మెల్యే సమక్షంలో భీంపూర్ మండలం తాంసి(కే) గ్రామానికి చెందిన 15 మంది కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో చేరారు.
నాయకులు కునార్పు వినోద్‌యాదవ్, భుజంగరావు, రషీద్‌ఖాన్, గంగన్న, దేవన్న సహా మరో 10 మంది కార్యకర్తలకు ఎమ్మెల్యే పార్టీ కండువాలు కప్పి బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎవరెన్ని చెప్పినా ఇక రాష్ట్రంలో వచ్చేది బీఆర్ఎస్ సర్కారేనని స్పష్టం చేశారు.
బోథ్ నియోజకవర్గ ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉంటానని, కార్యకర్తలు పరిస్థితిలో ధైర్యం వీడకుండా నూతనోత్సాహంతో స్థానిక సమస్యల పరిష్కారంలో ముందుండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల కన్వీనర్ మేకల నాగయ్య, మాజీ వైస్ ఎంపీపీ గడ్డం లస్మన్న, నాయకులు కుడిమెత సంతోష్, మడావి లింబాజీ, ఎం. కల్చాప్ యాదవ్, అఫ్రోజ్, గోప మహేందర్, గంగయ్య, ప్రవీణ్ తదితరులున్నారు.