మంచిర్యాల : జిల్లాలో కాంగ్రెస్ ( Congress ) వర్గీయుల మధ్య వర్గపోరు తీవ్రస్థాయికి చేరుకుంటుంది. మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొనేందుకు ఇద్దరు మంత్రులు వివేక్ వెంకటస్వామి( Minister Vivek ), జూపల్లి కృష్ణారావు ( Jupalli Krishna Rao ) జిల్లాలోని మందమర్రి మండలం గద్దరాగడి గ్రామంలోని ఫంక్షన్ హాల్‌కు సోమవారం చేరుకున్నారు.
ఈ సందర్భంగా మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని మంత్రులతో పాటు స్థానిక నాయకులు మాట్లాడారు. అయితే కొందరు నాయకులు మాట్లాడుతూ సంవత్సరాల తరబడి పార్టీని నమ్ముకుని సేవ చేసిన వారికి కాకుండా మధ్యలో వచ్చిన వారికి కౌన్సిలర్ టిక్కెట్లు అమ్ముకుంటున్నారని దళిత నాయకుడు కల్యాణ్ ఆరోపించారు.
దీంతో కాంగ్రెస్ నాయకులు మండిపడుతూ కల్యాణ్‌ను అక్కడి నుంచి పంపించి వేయడంతో సభలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో ఇద్దరు మంత్రులు సభ మధ్యలోనే అక్కడి నుంచి వెళ్లిపోవడంతో స్థానిక కాంగ్రెస్ నాయకులు విస్తుపోయారు.