నెన్నెల : కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నట్టేట్ట ముంచిందని బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య విమర్శించారు. బుధవారం నెన్నెల మండలంలోని గొల్లపల్లి, మైలారం గ్రామాలలో వర్షాలకు తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు నెల రోజులుగా రైతులు పంట కోసి వడ్లను కల్లాల్లోనే ఉంచారన్నారు. ఇప్పటి వరకు ఎవరు కొనేవాళ్లు లేక రైతులు ఆందోళన చెందుతున్నారు. కొనుగోళ్లు చేపట్టకుండా అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని మండి పడ్డారు.
గత పది రోజుల వ్యవధిలో నాలుగు సార్లు వర్షం కురిసిందని, దీంతో కల్లాలో ఉన్న ధాన్యం పూర్తిగా తడిసి పోయి మొలకెత్తుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రైస్ మిల్లర్లు రైతులను ముంచుతున్నారని, తరుగు తీసుకుంటున్న పట్టించుకునే వారే లేరన్నారు. ఎమ్మెల్యే వినోద్ రైతులను చుసిన పాపం పోలేదన్నారు. మంత్రి పదవి కోసం మాత్రం లెక్కలేనన్ని సార్లు ఢిల్లీకి పోయాడు తప్పా రైతు వద్దకు రాలేదు అన్నారు. రైతు పండించిన ప్రతి గింజను కొనాలని లేకుంటే ఆందోళన చేస్తామని హెచ్చరించారు.