ఎదులాపురం, ఆగస్టు 1 : డీఈఈ సెట్లో అర్హత సాధించిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా విద్యార్థులు 2024-26 విద్యా సంవత్సరంలో డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ, డిప్లొమా ఇన్ ప్రీ సూల్ ఎడ్యుకేషన్ కోర్సుల్లో చేరేందుకు ధ్రువపత్రాల పరిశీలన చేపట్టారు. గురువారం ఆదిలాబాద్ పట్టణంలోని డైట్ కళాశాలలో ఈ కౌన్సెలింగ్ ప్రక్రియను ఏర్పాటు చేయగా కళాశాల వైస్ ప్రిన్సిపాల్ కిరణ్‌కుమార్ ప్రారంభించారు. ర్యాంకుల ఆధారంగా పత్రాలను పరిశీలించి అభ్యర్థులకు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా కిరణ్ కుమార్ మాట్లాడుతూ.. ఈ ప్రక్రియ ఆరు రోజులపాటు కొనసాగుతుందని, అభ్యర్థులకు ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేశామన్నారు. రోజు 550 మంది అభ్యర్థుల సర్టిఫికెట్స్‌ను వెరిఫికేషన్ చేస్తామని పేర్కొన్నారు. వెరిఫికేషన్‌కు వచ్చేవారు తమ ఒరిజినల్ హాల్‌టికెట్స్, డీ సెట్ అప్లికేషన్ ఫాం, ర్యాంకు కార్డు, పదో తరగతి, ఇంటర్మీడియెట్ మారుల జాబితా, స్టడీ సర్టిఫికెట్, నివాస, ఆదాయ ధ్రువీకరణ పత్రాలతో హాజరుకావాలని సూచించారు. పూర్తి సమాచారం కోసం సంబంధిత వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు. మొదటి రోజు 550 మందికి 436 మంది హాజరు కాగా.. 114 మంది రాలేదు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ భోజన్న పాల్గొన్నారు.