తాండూర్, ఏప్రిల్ 4 : నాకు కొన్ని రోజుల సంది కండ్లు సరిగా కనిపిస్తలేవు. మా ఊరిలో కంటి వెలుగు శిబిరం పెడితే వచ్చి డాక్టరుకు సూపించుకున్న. పరీక్షలు చేసిన్రు. మందులు, అద్దాలు ఇచ్చిన్రు. ఇప్పుడు కండ్లు తేటగా కనిపిస్తున్నయ్.
గదే ప్రైవేట్ దవాఖా న్లకు పోతే వేలకు వేలయ్యేటివి. ఇక్కడ రూపాయి కూడా తీసుకోలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ మాలాంటి పేదోళ్ల కోసం మస్తు మంచి పనులు జేస్తుండు. పొద్దుగాల లేవంగనే గాయన్ని తల్సుకుంటున్నం. వచ్చే ఎన్నికల్లో కూడా గెలిపించుకుంటం.
– సింహరాజు శంకరమ్మ, కిష్టంపేట