ఆసిఫాబాద్ టౌన్, మే 10 : ఈ నెల 13న ప్రతి ఒకరూ ఓటు హకు వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ నుంచి అంబేదర్ చౌరస్తా వరకు 5-కే రన్‌ను జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారీ, ఏఎస్పీ ప్రభాకర్‌రావుతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియలో ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే టోల్ ఫ్రీ నం.1950కు, సీ-విజిల్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో నోడల్ అధికారులు, జిల్లా అధికారులు, యువతీయువకులు, విద్యార్థులు, బూత్ స్థాయి అధికారులు పాల్గొన్నారు.