ఆసిఫాబాద్ అంబేదర్చౌక్, మే 3 : ఎన్నికల్లో విధులు నిర్వహించే ప్రతీ ఉద్యోగీ పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హకు వినియోగించుకోవాలని కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేశ్ దోత్రే సూచించారు.
ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఆసిఫాబాద్ సెగ్మెంట్లో విధులు నిర్వహించే ఉద్యోగుల కోసం జిల్లా కేంద్రంలోని రాజస్వ మండలాధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఓటరు ఫెసిలిటేషన్ సెంటర్ను అదనపు కలెక్టర్ దాసరి వేణు, రాజస్వ మండలాధికారి లోకేశ్వరరావుతో కలిసి పరిశీలించారు. 8వ తేదీ వరకు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్లు, ఉద్యోగులు, ఎన్నికల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.