ఆసిఫాబాద్ టౌన్,సెప్టెంబర్ 13 : ఈ నెల 17న తెలంగాణ పాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్లో జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారీ, సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, జిల్లా రెవెన్యూ అధికారి లోకేశ్వర్రావుతో కలిసి సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి వేడుకలు విజయవంతం చేయాలన్నారు.
పోషణ మాసమును పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారీ, కాగజ్నగర్ సబ్ కలెక్టర్, పలుశాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ మానసిక, శారీరక ఎదుగుదల తకువగా ఉన్న పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, వారికి సకాలంలో పోషక విలువలు కలిగిన ఆహారంతో పాటు అవసరమైన మందులు అందించాలన్నారు. మెనూ ప్రకారం గర్భిణులు, బాలింతలు, కిశోర బాలికలు, పిల్లలకు ఆహారం అందించాలని, మెనూ పట్టికను బోర్డుపై ప్రదర్శించాలని, మండల, జిల్లా అధికారులు తరచూ అంగన్వాడీ కేంద్రాలను సందర్శించాలన్నారు.
మెనూ పాటించని వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. శామ్- మామ్ కార్యక్రమంలో ఆశ, ఆరోగ్య కార్యకర్తలు, అంగన్వాడీ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు పాల్గొని వారి వివరాలను కచ్చితంగా నమోదు చేయాలన్నారు. అనంతరం పోషణ్ అభియాన్ గోడ ప్రతులను ఆవిషరించారు. జిల్లా సంక్షేమ శాఖ అధికారి భాసర్, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి తుకారాం భట్, జిల్లా గిరిజనాభివృద్ధి శాఖ అధికారి రమాదేవి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి దత్తారాం, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.