ఆసిఫాబాద్ టౌన్,జూన్14 : వానకాలంలో ప్రబలే సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉం డాలని, గ్రామాల్లో విసృ్తత స్థాయిలో అవగాహన కల్పించాలని కుమ్రం భీం ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో వైద్యాధికారులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ వైద్యారోగ్య శాఖ, పంచాయతీ, ము న్సిపల్ అధికారులు సమన్వయం చేసుకుం టూ సీజనల్ వ్యాధులను అరికట్టాలని సూ చించారు. పారిశుధ్య పనులు సక్రమంగా చేపట్టాలని, డెంగీ, మలేరియా, చికెన్గున్యావంటి బారిన పడకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు.
తాగునీరు కలుషితం కాకుండా ప్ర త్యేక శ్రద్ధ చూపాలని, నీరు నిల్వ ఉండే చోట ఆయిల్ బాల్స్ వేయాలన్నారు. వారానికి రెం డు రోజులు డ్రై డే పాటించాలని సూచించారు. ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి ప్రతిరోజూ జ్వరాలపై నివేదిక సమర్పించాలని ఆదేశించారు. జిల్లాలోని అన్ని రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలలు, పాఠశాలలు, కేజీబీవీ వి ద్యాలయాలు, మోడల్ స్కూళ్లను సందర్శించి విద్యార్థుల ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలన్నారు. జిల్లాలోని ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలపై అవగాహన కల్పించాలన్నారు. ప్రసూతి మరణాలపై వైద్యులు అప్రమత్తంగా ఉండాలని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి తుకారాంభట్, వైద్యాధికారులు పాల్గొన్నారు.
ఈ నెల 20న నిర్వహించనున్న జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు. శుక్రవారం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమంపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ 19 ఏళ్లలోపు వారికి నులిపురుగుల నివారణ మాత్రలు అందించాలన్నారు. పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, కళాశాల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. జిల్లా వైద్యశాఖ అధికారి తుకారాం, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సురేందర్, జిల్లా పంచాయతీ అధికారి భిక్షపతి, జిల్లా విద్యాశాఖ లైజన్ అధికారి ఉదయ్ బాబు, ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి సజీవన్, బీసీ సంక్షేమశాఖ అధికారి సత్యనారాయణ రెడ్డి, జిల్లా సంక్షేమ శాఖాధికారి భాసర్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లా కేంద్రంలోని గ్రంథాలయంలో పాఠకులు, విద్యార్థులు, నిరుద్యోగులకు అవసరమైనన్ని సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని జిల్లా కేంద్ర గ్రంథాలయాన్ని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి మర్రి సురేందర్, జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి సరితతో కలిసి సందర్శించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా కేంద్ర గ్రంథాలయాన్ని రూర్బన్ పథకంలో భాగంగా నిర్మించారని, ఇంకా కావాల్సిన సదుపాయాలపై ప్రతిపాదనలు సమర్పించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో టీఎస్ఈడబ్ల్యూఐడీసీ ఇంజినీర్లు తదితరులు పాల్గొన్నారు.