ఆసిఫాబాద్ అంబేదర్ చౌక్, మార్చి 9 : మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ నియోజకవర్గాల పట్టభద్రులు, ఉపాధ్యాయ శాసనమండలి ఎన్నికల నేపథ్యంలో నిలిపివేసిన ప్రజావాణి కార్యక్రమాన్ని ఈ నెల 10వ తేదీ నుంచి యథాతథంగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ వెంకటేశ్ధోత్రే ఓ ప్రకటనలో తెలిపారు.
ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఈ నెల 8వ తేదీతో ముగియడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.