ఆసిఫాబాద్ అంబేదర్ చౌక్, మార్చి 26 : నీతి ఆయోగ్ పథకంలో భాగంగా తిర్యాణి బ్లాక్‌లో మంజూరైన పనులు త్వరగా చేపట్టాలని కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధాశుక్లాతో కలిసి వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఆస్పిరేషనల్ కార్యక్రమంలో భాగంగా బ్లాక్‌లలో అంబులెన్స్ సర్వీ స్ కల్పించేందుకు అవసరమైన పరిపాలనా అనుమతులు రూపొందించాలన్నారు.
20 గు రుకుల పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాల్లో శుద్ధమైన తాగునీరు అందించేందుకు ఆర్ఓ. ప్లాంట్లను ఏర్పాటు చేయాలని, జిల్లా కేం ద్రంలో సిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని ఎంపిక చేసి అనుమతులు పొందాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య ప్రణాళిక అధికారి కోటయ్య నాయక్, జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి రమాదేవి, జిల్లా సంక్షేమ అధికారి భాసర్, పశుసంవర్ధక శాఖ అధికారి సురేశ్, ఉపాధి కల్పనాధికారి రవికృష్ణ, వైద్య, ఆరోగ్యశాఖ అధికారి సీతారాం, డీఈవో, తదితరులు పాల్గొన్నారు.