గ్రూప్-1 పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి
జూన్ 9న గ్రూప్-1 పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో టీఎస్పీఎస్సీ చైర్మన్, జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) దీపక్ తివారీ, ఎస్పీ సురేశ్కుమార్ తో కలిసి జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు.
- ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే
ఆసిఫాబాద్ టౌన్, మే 20 : జూన్ 9న గ్రూప్-1 పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో టీఎస్పీఎస్సీ చైర్మన్, జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) దీపక్ తివారీ, ఎస్పీ సురేశ్కుమార్ తో కలిసి జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ గ్రూప్-1 పరీక్షల నిర్వహణ కోసం జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు)ను నోడల్ అధికారిగా నియమించడం జరిగిందని, సంబంధిత అధికారులను సమన్వయం చేసుకుంటూ ఎలాంటి పొరపాట్లు లేకుండా పరీక్షలు నిర్వహించాలన్నారు.
సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు చేశామని, ప్రశ్నాపత్రాలను పోలీసు బందోబస్తు నడుమ కేంద్రాలకు తరలించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో 13 కేంద్రాలను ఏర్పాటు చే శామని, నాలుగు ఫ్లయింగ్ స్వాడ్ బృందాలను ఏర్పా టు చేసి పర్యవేక్షించడం జరుగుతుందని తెలిపారు. బ యోమెట్రిక్ విధానం ద్వారా ఎలాంటి ఇబ్బందుల్లే పరీక్షల నిర్వహణ జరుగుతుందని, ఈ క్రమంలో సంబంధిత అధికారులకు 22న శిక్షణ ఇస్తామని తెలిపారు.
రోడ్డు భద్రతపై అవగాహన కల్పించాలి
రోడ్డు భద్రతా నియమాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో ఎస్పీ సురేశ్ కుమార్తో కలిసి జిల్లా రవాణా శాఖ, పంచాయతీరాజ్, రోడ్లు-భవనాలు, మున్సిపల్, ఇంజినీరింగ్ శాఖల అధికారులతో రోడ్డు ప్రమాదాల నివారణ, రోడ్డు భద్రత చర్యల అమలుపై సమీక్ష నిర్వహించారు.
కలెక్టర్ మాట్లాడుతూ బ్లాక్ స్పాట్ జాబితాలో ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక నిఘా పెట్టి ప్రమాదాలను నివారించేందుకు చర్యలు తీసుకోవాలని, వాహనదారులంతా రోడ్డు భద్రత నియమాలు పాటించేలా అవగాహన కల్పించాలని ఆదేశించారు. స్పీడ్ బ్రేకర్లు, మూల మలుపులు, ప్రమాద ప్రాంతాలు తెలిసేలా సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని, వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు రోడ్లు అనుసంధాన ప్రాంతాల్లో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని, ఆటోల్లో పరిమితికి మించి ప్రయాణికులను తరలించకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలకు కట్టుదిట్టమైన భద్రత
డీ-కేటగిరి ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల భద్రతకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు. సోమవారం జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) దాసరి వేణు, ఆసిఫాబాద్ తహసీల్దార్ శ్రీనివాస్ దేశ్ పాండే, ఎన్నికల పర్యవేక్షకుడు మధుకర్, డిప్యూటీ తహసీల్దార్ జితేందర్, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో జిల్లా వేర్ హౌస్ నుంచి వ్యవసాయ మారెట్ కమిటీ గోదాములకు ఈవీఎంలను తరలించి భద్రపరిచారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

