ఎదులాపురం, జనవరి 23 : కంటి వెలుగు కార్యక్రమం కోసం జిల్లా కేంద్రంలోని డీఎంహెచ్వో కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూంను సోమవారం ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ శ్రీజ పరిశీలించారు.
కంట్రోల్ రూంకు ప్రతి రోజూ వస్తున్న కాల్, ఆన్లైన్ డాటా నమోదు, వాటి పని తీరును అడిగి తెలుసుకున్నారు. ఆమె వెంట జిల్లా క్షయ నివారణ అధికారి శ్రీకాంత్, డీడీఎం రమణ, శివ, డీపీవో అనిల్, కంట్రోల్ రూం సూపర్వైజర్ సుభాష్ ఉన్నారు.