ఎదులాపురం, నవంబర్ 22 :మెరుగైన వైద్య సేవలందించి, వంద శాతం ప్రసవాలు ప్రభుత్వ దవాఖానలో జరిగేలా చర్యలు తీసుకోవాలని వైద్య సిబ్బందిని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన వైద్య, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులతో వివిధ అం శాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యులు అందుబాటులో ఉండి ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించాలన్నారు. గర్భిణులకు ప్రైవేట్ దవాఖానలకు పంపించకుండా ప్రభుత్వ దవాఖానలోనే ప్రసవాలు జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆశ, ఏఎన్ఎం, అంగన్వాడీ టీచర్లు ఇంటింటికీ వెళ్లి గర్భిణులను రిజిస్ట్రేషన్ చేయించి వారికి పౌష్టికాహారం అందించి ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవమయ్యేలా అవగాహన కల్పించాలని ఆదేశించారు. అనంతరం మెడికల్ ఆఫీసర్లను పీహెచ్‌సీల వారిని అడిగి తెలుసుకున్నారు.
చదువుతో పాటు అదనంగా ఏదో ఒక రంగంలోని సిల్స్లో నైపుణ్యం సాధించి ఉపాధి అవకాశాలు పొందాలని యువతకు కలెక్టర్ రాజర్షి సూచించారు. నైపుణ్యం కేంద్రం ద్వారా నిరుద్యోగ యువతకు 3 నెలల పాటు ఉచిత శిక్షణ ఇచ్చారు. శుక్రవారం వైటీసీలో శిక్షణ పూర్తి చేస్తున్న వారికి సర్టిఫికెట్లను కలెక్టర్ అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ టైలరింగ్, కంప్యూటర్, సీసీ కెమెరాలు, మొబైల్ రిపేరింగ్, కంప్యూటర్ శిక్షణ, రిఫ్రిజ్రేటర్, ఎయిర్ కండీష నర్ రిపేరింగ్‌లో 3 నెలల పాటు ఇచ్చే శిక్షణను వినియోగించుకోవాలన్నారు. టైలరింగ్ నేర్చుకున్న సిబ్బంది డ్వాక్రా గ్రూపులో సభ్యులుగా చేరాలన్నారు. 120 మంది యువత శిక్షణ పొందినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీవైఎస్వో వెంకటేశ్వర్లు, డీడబ్ల్యూవో బీ సబిత, ఫ్యాకల్టీ, సిబ్బంది, ప్రిన్సిపాల్ రవీందర్, వైటీసీ ఇన్చార్జి బలరాం, లలిత, సాగర్, విశాల్, సునీల్, తదితరులు ఉన్నారు.ax