ఆదిలాబాద్ : జొన్నల కొనుగోళ్లలో రైతులు ఇబ్బందులు పడకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. మంగళవారం బేల మార్కెట్ యార్డులో జొన్నల కొనుగోళ్లను పరిశీలించిన కలెక్టర్ రైతులతో మాట్లాడి, వారి సమస్యలను తెలుసుకున్నారు, జొన్నల కొనుగోలు ప్రక్రియ జూన్ మొదటి వారంలోగా తప్పనిసరిగా పూర్తి చేయాలన్నారు. హమాలీలు, లారీల కొరత, తదితర సమస్యల పై ఆరా తీసి వెంటనే సమస్యలను పరిష్కరించాలన్నారు. రేపటిలోగా హమాలీలు కేంద్రానికి వచ్చేలా చర్యలు తీసుకోవాలని కాంట్రాక్టర్ను ఆదేశించారు.
జిల్లాలో 16 కోనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని ఇంకా అదనంగా రెండు కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. ఈ ఏడాది జొన్న పంట అధికంగా వేశారనన్నారు. హమాలీ చార్జెస్, స్ట్రిచింగ్ చార్జెస్ నిబంధనల ప్రకారం తీసుకోవాలని, అధికంగా తీసుకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వేరే రాష్ట్రం నుండి మన జిల్లాకు జొన్నలు రాకూడదని, జిల్లా రైతుల జొన్నలు మాత్రమే కోనుగోలు చేయాలి. దళారులు ఎవరైనా వేరే రాష్ట్రం నుండి జొన్నలు తీసుకునివస్తే వారి పై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, డీసీవో మోహన్ నాయక్, తదితరులు ఉన్నారు.