ఎన్నికలు సజావుగా నిర్వహించాలి
పార్లమెంట్ ఎన్నికలు నిబంధనల ప్రకారం సజావుగా నిర్వహించాలని, అవసరమైన అన్ని ఏర్పాట్లు చే యాలని పెద్దపల్లి పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సూచించారు.
- పెద్దపల్లి పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి ముజమ్మిల్ ఖాన్
పెద్దపల్లి, మార్చి22 : పార్లమెంట్ ఎన్నికలు నిబంధనల ప్రకారం సజావుగా నిర్వహించాలని, అవసరమైన అన్ని ఏర్పాట్లు చే యాలని పెద్దపల్లి పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సూచించారు. శుక్రవారం కలెక్టరేట్లో జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి అదనపు కలెక్టర్లు దివాకర్, బీ రాహుల్, అరుణశ్రీతో కలిసి ఎన్నికల నిర్వహణపై ఏఆర్వోలతో సమన్వయ సమావేశం ని ర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ మంచిర్యాల, రామగుండంవంటి అర్బన్ ప్రాం తాల్లో ఓటరు నమోదు పెరిగేలా ప్రత్యేక కా ర్యక్రమలు నిర్వహించాలన్నారు
. ప్రతి పో లింగ్ కేంద్రంలో సహాయ కేంద్రాలు ఏర్పా టు చేయాలని, సదుపాయాలు కల్పించాలన్నారు. పార్లమెంట్ పరిధిలో విధులు నిర్వహించే ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ, ఇతర బృందాలకు అవసరమైన శిక్షణ అందించాలన్నారు. ఎన్నికల నేపథ్యంలో బ్యాంకర్లతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి అనుమానాస్పద లా వాదేవీల వివరాలు ఎప్పటికప్పుడు అధికారులకు అందించేలా చూడాలన్నారు. ఈవీఎంల ర్యాండమైజేషన్ ప్రక్రియ రాజకీయ పార్టీ ప్రతినిధుల సమక్షంలో జరగాలన్నారు. ఎన్నికల విధులు నిర్వహించే ప్రతి ఉద్యోగికి తప్పనిసరిగా పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటింగ్ హ కు వినియోగించే అవకాశం కల్పించాలని సూచించారు. సమావేశంలో మంచిర్యాల, చె న్నూర్, మంథని, పెద్దపల్లి ఆర్డీవోలు, డిప్యూ టీ తహసీల్దార్ ప్రవీణ్, కలెక్టరేట్ ఏవో శ్రీనివాస్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

