చెన్నూర్, ఫిబ్రవరి 14 : రానున్న వేసవిని దృష్టిలో పెట్టుకొని తాగు నీటికి ఇబ్బందుల్లేకుండా ముందస్తు ప్రణాళికలు రూపొందించాలని, నిరంతరాయంగా తాగు నీరందించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు. శుక్రవారం చెన్నూర్ పట్టణంలోని బతుకమ్మ వాగు వద్ద తాగు నీరు సరఫరా చేసే ట్యాంకును, బట్టిగూడెం కాలనీలోని వాటర్ ట్యాంకును పరిశీలించారు.
మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ తాగు నీరందించేలా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణను ఆదేశించారు. పైపులైన్ల మరమ్మతులుంటే వెంటనే చేపట్టాలని సూచించారు. అమృత్ పథకంలో భాగంగా తాగు నీటి ట్యాంకుల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.