నస్పూర్, జూలై 15 : ప్రజావాణి కార్యక్రమం ద్వారా వచ్చిన అర్జీల పరిష్కారానికి కృషి చేస్తామని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లో జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్‌తో కలిసి అర్జీలను స్వీకరించారు. చెన్నూరు, భీమారం, బెల్లంపల్లి, వేమనపల్లి, నస్పూర్, హాజీపూర్ తదితర ప్రాంతాల ప్రజలు పింఛన్, ఉపాధి, భూ కబ్జాలు, ధరణి సమస్యలు తదితర వాటిపై అర్జీలు అందించారు. 62 అర్జీలు వచ్చాయని, ప్రతి దరఖాస్తునూ క్షేత్రస్థాయిలో పరిశీలించి సంబంధిత అధికారుల సమన్వయంతో పరిష్కరిస్తామని తెలిపారు.
ఆసిఫాబాద్ అంబేదర్ చౌక్, జూలై 15 : వివిధ సమస్యలపై ప్రజావాణికి వచ్చిన అర్జీలను పరిశీలించి త్వరగా పరిషరించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను కుమ్రం భీం ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) దాసరి వేణు, కాగజ్ నగర్ ఆర్డీవో కాసబోయిన సురేశ్‌తో కలిసి, వివిధ శాఖల అధికారులు అర్జీలను స్వీకరించారు. విద్యాలయాల్లో సీట్ల కోసం, దివ్యాంగ, వృద్ధాప్య, వితంతు పింఛన్లు, భూ కబ్జా, ధరణి సమస్యలు, గ్రామాల్లో సమస్యలు తదితర వాటిపై ప్రజలు అర్జీలు అందించారు. ప్రతి దరఖాస్తునూ క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు.
– కుమ్రం భీం ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే