ఓటరు జాబితా రూపకల్పనలో పార్టీల పాత్ర కీలకం
ఓటరు జాబితా రూపకల్పనలో రాజకీయ పార్టీల పాత్ర కీలకమైనదని కలెక్టర్ బోరడే హేమంత్ సహదేవరావు అన్నారు. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మంగళవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ దాసరి వేణు, ఆర్డీవో సురేష్తో కలిసి గుర్తిం పు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు.
- కలెక్టర్ బోరడే హేమంత్ సహదేవరావు
ఆసిఫాబాద్ టౌన్, జనవరి 16 : ఓటరు జాబితా రూపకల్పనలో రాజకీయ పార్టీల పాత్ర కీలకమైనదని కలెక్టర్ బోరడే హేమంత్ సహదేవరావు అన్నారు. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మంగళవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ దాసరి వేణు, ఆర్డీవో సురేష్తో కలిసి గుర్తిం పు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 20, 21 తేదీల్లో జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తామన్నారు. 18 ఏళ్లు నిండిన వారందరూ ఓటరుగా నమోదు చేసుకునేందుకు, మరణించిన వారి పేర్లు జాబితా నుంచి తొలగించేందుకు నేతలు సహకరించాలని కోరారు. పేర్లు, చిరునామా ఇతర వివరాల సవరణ కోసం అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో ఎన్నికల విభాగం అధికారులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

