ఇంద్రవెల్లి, జూన్ 12 : అంగన్వాడీ కేంద్రాల్లో ఐదేండ్లు నిండిన పిల్లలను చేర్పించాలని, ప్రభుత్వ పాఠశాలల్లోనే మెరుగైన విద్య అందుతున్నదని కలెక్టర్ రాజర్షిషా అన్నా రు. బుధవారం మండల కేంద్రంలోని ఎంపీపీఎస్-2 పాఠశాలలో ఏర్పాటు చేసిన జయశంకర్ సార్ బడిబాట కార్యక్రమంలో కలెక్టర్ రాజర్షి షా, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ పాల్గొన్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఉచిత పాఠ్యపుస్తకాలతోపాటు దుస్తులను కలెక్టర్ రాజర్షిషా, ఎమ్మెల్యే బొజ్జుపటేల్ విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జయశంకర్ సార్ బడిబాట కార్యక్రమాలు ఈ నెల 19వ తేదీ వరకు నిర్వహిస్తామన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి మెరుగైన విద్యను పొందాలన్నారు. మహిళా సంఘాల ద్వారా ప్రతి పాఠశాల ఆవరణలో కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేసి కూరగాయలను పండించాలన్నారు.
ప్రభుత్వ పాఠశాలలను అద్భుతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని, అమ్మ ఆదర్శ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందిస్తున్నామని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. విద్యా వ్యవస్థను మెరుగుపర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీని త్వరలో ప్రారంభిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పోటే శోభాబాయి, జడ్పీటీసీ ఆర్కా పుష్పలత, ఎంపీటీసీ జాదవ్ స్వర్ణలత, డీఆర్డీవో సాయన్న, ఆర్డీవో జీవకర్రెడ్డి, తహసీల్దార్ ప్రవీణ్‌కుమార్, ఎంపీడీవో భాస్కర్, ఎంఈవో నారాయణ, గిర్ధావర్ మెస్రం లక్ష్మణ్, ఏంపీవో జీవన్‌రెడ్డి, ఏవో అరుణ, ఏఈలు లింగన్న, భానుకుమార్, ఐకేపీ ఏపీఎం రామారావ్, ఈజీఎస్ ఏపీవో జాదవ్ శ్రీనివాస్, ఈవో సంజీవరావ్ పాల్గొన్నారు.
రైతులు విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసిన రసీదుల ను భద్రంగా ఉంచుకోవాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ఎరువులు, విత్తనాల దుకాణాన్ని తనిఖీ చేశారు. అన్ని రకాల విత్తనాలను అం దుబాటులో ఉంచాలని వ్యాపారస్తులకు సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విత్తనాలు కొనుగోలు చేసిన రైతులు వ్యాపారస్తులు అందిస్తున్న రసీదులతోపాటు విత్తనాల ప్యాకెట్ల కవర్లను భద్రంగా ఉంచుకోవాలన్నారు. అనంతరం మండలకేంద్రంలోని బుద్ధనగర్‌లో మిషన్ భగీరథ నీటితోపాటు నల్లాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.
ఖానాపూర్ రూరల్, జూన్ 12 : మస్కాపూర్ ప్రభుత్వ పాఠశాల బాగుందని కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ పేర్కొన్నా రు. ఈ సందర్భంగా నిర్వహించిన బడిబాట కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం విద్యారంగం అభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేపడుతున్నదని పేర్కొన్నారు. అనంతరం అదే గ్రామంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలను సందర్శించారు. ఈ కార్యక్రమంలో డీఈవో రవీందర్‌రెడ్డి, మండల స్పెషల్ ఆఫీసర్ రాంబాబు, ఎంఈవో జీ.మధూసుదన్, తహసీల్దార్ ఎం.శివరాజ్, ఎంపీడీవో సునీత, ఎంపీపీ అబ్దుల్ మోహిద్, వైస్ ఎంపీపీ వాల్ సింగ్, ఎంపీటీసీ పుప్పాల స్వప్న, హెచ్ఎం నరేందర్‌రెడ్డి, ఉపాధ్యాయులు జాడి శ్రీనివాస్, కుర్ర శేఖర్, నరేందర్, నాయకులు పుప్పాల గజేందర్, దయానంద్ పాల్గొన్నారు.