నిర్మల్ టౌన్, మే 21 : ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలోధాన్యం కొనుగోళ్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈనెల 31వ తేదీలోగా ధాన్యం కొనుగోలు ప్రక్రియను పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ధాన్యం తడవకుండా టార్పాలిన్లు, గన్నీ బ్యాగ్స్ అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఈ సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ కిశోర్ కుమార్, డీఆర్డీవో విజయలక్ష్మి, డీఎస్వో శ్రీకళ, జిల్లా వ్యవసాయశాఖ అధికారి అంజిప్రసాద్, డీసీవో నర్సయ్య, తదితరులు పాల్గొన్నారు.
ధాన్యం తరలింపులో జాప్యం చేయద్దు
ధాన్యం తరలింపులో అధికారులు జాప్యం చేయవద్దని కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అన్నారు. పట్టణంలోని మంజులాపూర్లో గల ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయన వెంట జిల్లా అధికారులు నందిత, శ్రీకళ, విజయలక్ష్మి ఉన్నారు.