ఖానాపూర్, మార్చి 26 : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా ప్రతి మండలానికి ఒక మోడల్ హౌస్ నిర్మాణ ప నులు చేపడుతున్నట్లు కలెక్టర్ అభిలాష అభినవ్ పేర్కొన్నారు. బుధవారం ఖానాపూర్ పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయ ఆవరణంలో నిర్మిస్తున్న మోడల్ హౌస్ నిర్మాణ ప నులను పరిశీలించారు. ఇంటి లోపల డిజైన్, సౌకర్యాలపై అధికారులకు కీలక సూచనలు చేశారు. పనులు గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. మండలంలోని పైలెట్ విలేజ్లో కొనసాగుతున్న ఇందిరమ్మ సర్వే, మార్కింగ్, ఇంటి నిర్మాణ పనులపై ఆరా తీశారు.
హౌసిం గ్ పనులకు అధికారులు మార్కింగ్ చేసిన స్థలాల్లో లబ్ధిదారులు నిర్లక్ష్యం చేయకుండా పనులు ప్రారంభించాలని అన్నారు. ఇతర ప్రాంతాల్లో ఇండ్ల సర్వే కొనసాగుతుందని దశలవారీగా అర్హులందరికీ ఇండ్లు వస్తాయని వివరించారు. అనంతరం ఎంపీడీవో చాంబర్లో మున్సిపల్, రెవెన్యూ అధికారులతో ఎల్ఆర్ఎస్, ఇంటి పన్నుల వసూళ్లపై తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట హౌసింగ్ పీడీ రాజేశ్వర్, ఎంపీడీవో సునీత, తహసీల్దార్ సుజాత, ఎంపీడీవో రత్నాకర్ ఉన్నారు.