శ్రీరాంపూర్, జనవరి 25 : హైదరాబాద్ సింగేరేణి భవన్లో నూతనంగా ఏర్పాటు చేసిన నూతన సింగరేణి సందర్శకుల గ్యాలరీని శనివారం సీఎండీ ఎన్ బలరాం ప్రారంభించారు. సీఎండీ మాట్లాడుతూ.. మన రాజ్యాంగమే మన బలం.. అందరూ గౌరవించుకోవాలని కోరారు. భారత రాజ్యాంగంపై ప్రతిఒక్కరికీ అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో సింగరేణి భవన్లో సందర్శకుల గ్యాలరీలో రాజ్యాంగ ప్రతిని పొందపర్చినట్లు పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని ఆమోదించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అందరికీ రాజ్యాంగ ప్రతిని సింగరేణి భవన్లో ఏర్పాటు చేశామన్నారు.
జీఎం కోఆర్డినేషన్ ఎస్డీఎం సుభానీ, జీఎం మార్కెటింగ్ డీ రవిప్రసాద్ పాల్గొన్నారు. బొగ్గు మైనింగ్ రంగంలో సుధీర్ఘ అనుభవమున్న సింగేణి కాలరీస్ లిథియంలాంటి క్రిటికల్ మినరల్స్ రంగంలోకి ప్రవేశించాలన్న సీఎం, డిప్యూటీ సీఎంల ఆదేశాల మేర కు యాజమాన్యం ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నది. ఇందులో భాగంగా డిప్యూటీ సీఎం సమక్షంలో ఇటీవల హైదరాబాద్ ఐఐటీ తో కీలక ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే.
ఈ ఒప్పందానికి కొనసాగింపుగా సింగరేణి భవన్లో ఐఐటీ డైరెక్టర్ బీఎస్ ముర్తి నేతృత్వంలో ప్రొఫెసర్ల బృందం సీఎండీ, డైరెక్టర్లు, సీనియర్ మైనింగ్ అధికారులతో ప్రత్యేకంగా సమావేశమైంది. సింగరేణి చేస్తున్న ప్రయత్నాలకు హైదరాబాద్ ఐఐటీ పూర్తి సహకారం అందిస్తున్నదని ఆ సంస్థ డైరెక్టర్ బీఎస్ మూర్తి పేర్కొన్నారు. ఈ సమావేశంలో కొత్తగూడెం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా డైరెక్టర్లు సత్యనారాయణ, వెంకటేశ్వర్‌రెడ్డి, హైదరాబాద్‌లో జీఎం కోఆర్డినెషన్ ఎస్డీ సుభానీ, క్రిటికల్ మినరల్స్ అసోసియేషన వ్యస్థాపక అధ్యక్షులు, నిపుణులు సందీప్ హామమీళ్టరన్, ఐఐటీ నుంచి ప్రొఫెసర్ నరసింహా, అసిస్టెంట్ ప్రొఫెసర్ అసోక్ కామరాజు పాల్గొన్నారు.