మంచిర్యాల జిల్లా పర్యటనకు వచ్చిన ప్రగతి రథసారథి, సీఎం కేసీఆర్‌కు ఘన స్వాగతం లభించింది. రాష్ట్రమంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, విప్, బీఆర్ఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్, ఎంపీ వెంకటేశ్ నేతకాని, ఎమ్మెల్సీ దండె విఠల్, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, మంచిర్యాల జిల్లా అధికారులు తదితరులు పూలబొకే అందించి స్వాగతం పలికారు.
నాకొడుకుకు సింగరేణి ఉద్యోగం
సీసీసీ నస్పూర్, జూన్ 9 : నా పేరు అక్కల రమేశ్. నేను శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే న్యూటెక్ గనిలో 35 యేండ్లు పనిచేసిన. అనారోగ్యంతో మెడికల్ అన్‌ఫిట్ అయిన. సీఎం కేసీఆర్ సింగరేణిలో కారుణ్య నియామకాలు అమలు చేయడంతో నా అనారోగ్య సమస్యను మెడికల్ బోర్డుకు పంపిన. దీంతో నాకు 2022లో అన్‌ఫిట్ వచ్చింది. నా కొడుకుకు ఉద్యోగం పెట్టిస్తున్న. సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు ఉండేవి. అవి జాతీయ సంఘాలు పోగొట్టాయి. సీఎం కేసీఆర్ సార్ కార్మికులకు ఇచ్చిన హామీ మేరకు సింగరేణిలో కారుణ్య నియామకాలు జరుగుతున్నాయి. సీఎం సార్‌కు మా కుటుంబం రుణపడి ఉంటుంది.
గుంట భూమి లేదు..
మంచిర్యాల అర్బన్, జూన్ 9 : మాది హాజీపూర్ మండలం దొనబండ. మాకు ఉండడానికి సొంత ఇల్లు లేదు. మా అత్తమామలకు ఉన్న చిన్న పూరిగుడిసెలోనే నేను, నా భర్త బానేశ్, ఇద్దరు ఆడపిల్ల (నిశ్విత, వర్షిణి)లతో పాటు పెండ్లి కాని ఇద్దరు మరుదులతో కలిసి ఉంటున్నాం. కేసీఆర్ సారు పుణ్యమాని మాకు ఇంటి నిర్మాణం కోసం 75 గజాల భూమి ఇచ్చారు. మా గొంతులో పాణం పోయేంత దాకా మేము కేసీఆర్ వెంటే ఉంటాం.
– తోటపల్లి లావణ్య, దొనబండ
జాగ లేని మాకు జాగ చూపిండు..
మంచిర్యాల అర్బన్, జూన్ 9 : మా అత్తామామలిచ్చిన చిన్న గుడిసెలోనే ఉంటూ రెక్కల కట్టంతో కొడుకు, కూతురుకు పెండ్లి చేసినం. ఎనకటి గుడిసెలోనే నా భర్త పోషయ్య, నేను ఉంటున్నాం. ఈ చిన్న గుడిసె ఆసాలు కూడా తుప్పుపట్టి కూలేలా ఉన్నయ్. మా కట్టాలు తెల్సుకున్న కేసీఆర్ సారు దేవుడిలెక్క మాకు ఇల్లు కట్టుకునేందుకు భూమి ఇచ్చిండు. మాపొంటి భూమి కాగితాలు ఇచ్చిండు. మా లాంటి ముసలోల్లకు గింత జాగ చూపించి మా ఇంటి పెద్దకొడుకులా కేసీఆర్ సారు ఉన్నడు.
– బిరుదుల లక్ష్మి, దొనబండ
కులవృత్తులను బతికించారు..
సీసీసీ నస్పూర్, జూన్ 9: మాది బెల్లంపల్లి నియోజకవర్గంలోని నెన్నెల మండలం కుశ్నపల్లి గ్రామం. కులవృత్తులు చేసుకుంటున్న వారికి సాయం చేయడానికి లక్ష సబ్సిడీ రుణాలు ఇయ్యడానికి సీఎం సారు నిర్ణయించడం సంతోషంగా ఉంది. మేము మా తాతముత్తాల నుంచి దశలిపట్టు, చేనేత కులవృత్తి చేసుకుంటూ బతుకుతున్నం. మమ్మల్ని ఆదుకోవడానికి కేసీఆర్ సార్ ఇది వరకు చేనేత బీమా తీసుకొచ్చిండు. ఇప్పుడు కుల వృత్తులకు సాయం చేయడానికి లక్ష రూపాయలు ప్రకటించిండు. మాకు చాలా ఆనందంగా ఉంది. ఇక అప్పులు చేయాల్సిన పనిలేదు. సీఎం కేసీఆర్ సార్‌కు మా కుటుంబమంతా రుణపడి ఉంటది.
– అక్కె శంకరయ్య, నెన్నెల
నేను కేసీఆర్ సార్ వీరాభిమానిని
సీసీసీ నస్పూర్, జూన్ 9: నేను సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా చెన్నైలో పనిచేస్తా. ప్రస్తుతం మంచిర్యాల నుంచి వర్క్‌ఫ్రమ్ హోం చేస్తున్నా. నేను సీఎం కేసీఆర్ వీరాభిమానిని. చిన్నప్పటి నుంచి సార్ అంటే నాకు ఎంతో ఇష్టం. ఎక్కడైనా మీటింగ్‌లు జరిగితే నాకు ఎంత పని ఉన్నా తప్పకుండా చూస్తా. సీఎం సార్ వస్తున్నాడని నేను ప్రత్యేకంగా మంచిర్యాలలో జరుగుతున్న డెవలప్మెంట్ పనులను తెలియజేసేలా ప్రత్యేకంగా టీషర్ట్ తయారు చేసుకొని వేసుకున్న. సీఎం కేసీఆర్ సార్ మంచిర్యాలను జిల్లాగా ప్రకటించిన్రు. మెడికల్ కళాశాల ఇచ్చారు. మేమెప్పుడు ఆయన వెంటే ఉంటాం.
– ఇరుకుల్ల శివప్రసాద్, సాఫ్ట్వేర్, మంచిర్యాల
పింఛన్ ఇచ్చి మా ఆకలి తీరుస్తున్నరు..
సీసీసీ నస్పూర్, జూన్ 9: నేను సింగరేణిలో పనిచేసి రిటైర్ అయ్యా. సమైక్య రాష్ట్రంలో యాజమాన్యం గోల్డ్‌న్ హ్యాండ్ షేక్ పథకం తెచ్చింది. నేను ఆ పథకం ద్వారా దిగిపోయిన. అప్పుడు మాకు పింఛన్ వెయ్యిలోపే ఉంది. కేసీఆర్ సార్ అచ్చినంక మాకు గవర్నమెంట్ పింఛను ఇచ్చి మా ఆకలి తీరుస్తున్నరు. ఈ పింఛన్ రాకుంటే మా పరిస్థితి దారుణంగా ఉండేది. రేషన్ బియ్యం అత్తన్నయ్. మేము మంచిగనే ఉంటున్నం. సీఎం సార్ నస్పూర్‌కు అత్తండని నేను అచ్చిన. రూ.2వేల పింఛన్ ఇచ్చి మా ఆకలి తీరుస్తున్నడు. కేసీఆర్ సార్‌కు చేతులెత్తి మొక్కుతున్న.
-గరిగె ఎల్లయ్య, నస్పూర్
మా ఊర్లు మంచిగ అయితన్నయ్
సీసీసీ నస్పూర్, జూన్ 9: తెలంగాణ అచ్చినంక మా ఊర్లు మంచిగ అయినయ్. ఊర్లు మొత్తం పచ్చగ కనిపిత్తున్నయ్. తెలంగాణ రాకముందు ఇలా లేకుండే. కేసీఆర్ ముఖ్యమంత్రి అయినంక బాగా మార్పులు అచ్చినయ్. మాకు చేతినిండా కూలిపని దొరకుతుంది. నాకు రెండువేల పింఛన్ అత్తంది. మాకు అన్ని సవ్లతులు అందిస్తున్న గవర్నమెంట్‌కు కృతజ్ఞతలు. మేమంతా సీఎం కేసీఆర్ సార్‌కు రుణపడి ఉంటాం. సార్ మీటింగ్ ఉందని నస్పూర్‌కు అచ్చినం.
– దాసరి లింగయ్య, భీమారం
కేసీఆర్ సార్‌ను సూడ్డానికి అచ్చిన
సీసీసీ నస్పూర్, జూన్ 9 : మాది జైపూర్ మండలం గంగిపెల్లి గ్రామం. సీఎం కేసీఆర్ సార్ మంచిర్యాలకు అత్తండని మనుమడితో ఇక్కడికి అచ్చిన. సార్‌ను సూడాలని ఎప్పటి నుంచో అనుకుంటున్న. మా దగ్గరికి సీఎం సారు రావడం సంతోషంగా ఉంది. తెలంగాణ గవర్నమెంట్ అచ్చినంక నాకు రెండు వేల పింఛన్ అత్తంది. కర్సులకు ఆ పైసలు మాకు ఎంతో ఆసరా అయితున్నయ్. మాకు అన్ని రకాలుగా సాయం అందిస్తున్న సీఎం కేసీఆర్ సార్‌కు మేమంతా అండగా ఉంటాం.
– అరుగుల లక్ష్మి, జైపూర్