నాయీ బ్రాహ్మణులు, రజకులు, కుమ్మరి, అవుసుల, కంసాలి, కంచరి, వడ్ల, కృష్ణ బలిజ, మేదరి, వడ్డెర, ఆరె కటిక, మేర, ఎంబీసీ కులస్తుల వద్ద ఇదే కులానికి చెందిన వారు కూలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. సొంతంగా దుకాణాలు పెట్టుకునే ఆర్థిక స్థోమత లేక కాలం వెళ్లదీస్తున్నారు. సీఎం కేసీఆర్ కులవృత్తులకు జీవం పోయాలని సంకల్పించడం వీరికి వరంగా మారింది. ఇప్పటికే సాయం చేస్తామని రాష్ట్ర సర్కారు ప్రకటిం చగా.. చాలా మంది దరఖాస్తులు సమర్పించారు. ప్రభుత్వం అధికారులతో సర్వే నిర్వహించి అర్హులైన వారిని ఎంపిక కూడా చేసింది. రెండు రోజుల క్రితం నిర్మల్ జిల్లాలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అర్హులకు రూ.లక్ష సాయం చెక్కులను కూడా పంపిణీ చేశారు. మొదటి విడుతలో నియోజకవర్గానికి 300 మందికి సాయం అందిస్తుండగా.. మిగతా వారికి కూడా త్వరలో నే ఇవ్వనున్నారు. కాగా.. ఇది నిరంతర ప్రక్రియ అని అధికారులు పేర్కొంటున్నారు.
– మంచిర్యాల, జూలై 22(నమస్తే తెలంగాణ ప్రతినిధి)
మంచిర్యాల, జూలై 22(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : సీఎం కేసీఆర్ కులవృత్తుల సంక్షేమానికి పెద్దపీట వేశారు. గతంలో ఎవరూ పట్టించుకోక నిర్జీవమైన కుల వృత్తులకు కొండంత అండగా నిలిచారు. గొల్ల, కురుమలకు గొర్రె పిల్లలు పంపిణీ చే స్తే.. మత్స్యకారులకు చేపపిల్లలు ఇచ్చారు. గౌడన్నలకు ప్రమాద బీమాతోపాటు వృద్ధులకు పింఛన్ వస్తున్నది. నాయీ బ్రాహ్మణుల సెలూన్ షాపుల కు, రజక సోదరుల ధోబీఘాట్లకు ఇప్పటికే 101 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నా రు. ఇలానే రాష్ట్రంలో కులవృత్తిని నమ్ముకొని బతుకుతున్న ప్రతి ఒక్కరికీ రూ.లక్ష సాయం చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా దరఖాస్తులను ఆహ్వానించి అర్హులైన వారిని ఎంపిక చేశారు. ఇప్పటికే నిర్మల్ జిల్లాలో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పలువురికి చెక్కులు అందజేయగా, మిగిలిన జిల్లాల్లో ఈ నెలాఖరులోగా అర్హులకు చెక్కులు అందజేయనున్నారు. ముందుగా ప్రతి నియోజకవర్గంలో 300 మందికి ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున ఇవ్వనున్నారు.అనంతరం దశలవారీగా అర్హులందరికీ ఈ పథకం చెక్కులు ఇవ్వనున్నట్లు బీసీ సంక్షేమ శాఖ అధికారులు తెలిపారు.
ఉమ్మడి జిల్లాలో 42 వేల పైచిలుకు దరఖాస్తులు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రూ.లక్ష సాయం కోసం 42,906 దరఖాస్తులు వచ్చాయి. కాగా.. కులవృత్తులకు సంబంధించి కాకుండా ఇతర వ్యాపారాలు అంటూ దరఖాస్తుల్లో పేర్కొన్నారు. అధిక దరఖాస్తులు ఈ కారణంగానే తిరస్కరణకు గురయ్యాయి. కులవృత్తులకు అవసరమైన పరికరాలు, కులవృత్తిపై ఆధారపడి చేసే వ్యాపారాల కోసం పెట్టుకున్న దరఖాస్తులను అప్రూవల్ ఇచ్చారు. అలా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 28,995 మంది రూ.లక్ష సాయానికి అర్హత సాధించారు. అత్యధికంగా నిర్మల్ జిల్లాలో 11,498, మంచిర్యాలలో 7,783, ఆదిలాబాద్‌లో 11,721, కుమ్రం భీం ఆసిఫాబాద్‌లో 5,558 మంది అర్హులుగా గుర్తించారు. వీరిందరికీ త్వరలోనే సాయం అందించనున్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్జిల్లా వివరాలు..
దుకాణం పెట్టుకుంట..
నిర్మల్, జూలై 22(నమస్తే తెలంగాణ) : మాది నిర్మల్ జిల్లా మామడ మండ లంలోని పరిమండల్ గ్రామం. నేను వెంకటరమణ అనే మేస్త్రి వద్ద కూలీకి వడ్రంగి పనిచేస్తా. సొంతం గా దుకాణం పెట్టుకుందామంటే డబ్బులు లేవు. సీఎం కేసీఆర్ సారు మాలాంటి వారిని ఆదుకోవడానికి రూ.లక్ష సాయం చేస్తున్నడు. దరఖాస్తు చేసుకున్నా. మొన్ననే మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి కూడా చెక్కు అందించారు. ఈ డబ్బులతో మా ఊరిలోనే దుకాణం పెట్టు కుంట. వచ్చే ఆదాయంతో నా కుటుంబాన్ని పోషించుకుంట. నా భార్య స్వప్నకు కూడా బీడీ పింఛన్ వస్తున్నది. ఇద్దరు పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నరు. ఇంతకంటే ఏం కావాలి.
– ముత్యాల రాకేశ్, వడ్రంగి, పరిమండల్
మా కుటుంబాన్ని దేవుడిలా ఆదుకున్నరు
దేవుడున్నడో లేడో తెలియదు. కానీ మా కుటుంబానికి సీఎం కేసీఆరే దేవుడయ్యిం డు. ఆర్థిక ఇబ్బందులతో నా భర్త సాయన్న ఏడేళ్ల కింద చనిపోయిండు. అప్పటి నుంచి మా కుల వృత్తి అయిన కుమ్మరి పని చేసుకుంటున్న. ముగ్గురు పిల్లలను సాదుకుంటున్న. పోయినేడాది పెద్ద బిడ్డ పెండ్లి చేసిన. సర్కారోళ్లు కల్యా ణ లక్ష్మి కింద రూ. లక్ష సాయం చేసిన్రు. మళ్లా ఇప్పుడు కుల వృత్తి చేసుకొమ్మని రూ. లక్ష ఇచ్చిన్రు. ఒక్క మా ఇంటికే రూ. 2 లక్షలు వచ్చినయ్. ఇగ నా రెండో బిడ్డ డిగ్రీ చదువుతున్నది. ఇగ చిన్న బిడ్డకు పుట్టుకతోనే కం డ్లు కనబడవు. ఇంటి వద్ద నాతోనే ఉంటది. జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్న. సీఎం కేసీఆర్ మా బతుకుల కు భరోసా ఇచ్చిండు. మాకు ఆయన దేవుడి కంటే ఎక్కువ. ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటం.
– పోతుగంటి లలిత, లబ్ధిదారు, సాంగ్వి
అర్హులందరికీ సాయం..
బీసీల్లోని కులవృత్తిదారులకు రూ.లక్ష ఆర్థిక సాయాన్ని అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా అర్హులైన వారి నుంచి దరఖాస్తులు స్వీకరించాం. మొదటి విడుతలో నియోజకవర్గానికి 300 మందికి రూ.లక్ష సాయాన్ని అందిస్తున్నాం. ఇప్పటికే నిర్మల్‌లో కొంతమందికి ఇవ్వడం జరిగింది. త్వరలోనే మిగతా వారికి కూడా చెక్కులు పంపిణీ చేస్తాం. ఇది నిరంతర ప్రక్రియ. ప్రతినెలా పంపిణీ ఉంటుంది. పూర్తి పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేశాం. ఎవరూ కూడా దళారులను ఆశ్రయించి మోసపోవద్దు.
– వీ.లోకేశ్వర్‌రావు, జిల్లా వెనుకబడిన తరగతుల శాఖ అభివృద్ధి అధికారి, నిర్మల్.
ఇది గొప్ప నిర్ణయం
మంచిర్యాల అర్బన్, జూలై 22 : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ కుల వృత్తుల వారికి న్యాయం చేస్తున్నరు. మంగళి, చాకలి వాళ్లకి ఇప్పటికే 250 యూనిట్ల వరకు కరెంట్ ఉచితంగా ఇస్తున్నరు. మళ్లీ ఇప్పుడు రూ. లక్ష ఆర్థికసాయం చేస్తున్నరు. కుల వృత్తులను నమ్ముకొని జీవిస్తున్న వారు సొంతంగా దుకాణాలు ఏర్పాటు చేసుకోవ చ్చు. ఎవరిపై ఆధారపడకుండా ఉపాధి పొందవచ్చు. వ్యాపారాన్ని పెంపు చేసుకోవచ్చు. ఇది చాలా గొప్ప నిర్ణయం. సీఎం కేసీఆర్ అన్ని వర్గాలకు మేలు చేస్తున్నరు. ఇసొంటి సీఎం ఉన్నంత కాలం ప్రజలకు రంది లేదు.
– ఆయిరిపల్లి సత్యం, మంచిర్యాల