రాష్ట్ర ప్రభుత్వం ఆదిలాబాద్‌కు మరో వరం అందించింది. ఇప్పటికే డిగ్రీ, పీజీ, ఎంబీబీఎస్, వ్యవసాయ కళాశాలలు ఇవ్వగా, తాజాగా.. జేఎన్టీయూ ఇంజినీరింగ్ కాలేజీ మంజూరు చేసింది. ఇందులో భాగంగా మంగళవారం సాంకేతిక విద్యాశాఖ జీవో ఎంఎస్ 67ను జారీ చేసింది. మరోవైపు కళాశాల ఏర్పాటుకు తగిన చర్యలు తీసుకోవాలంటూ ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ సిబ్బందికి ఆదేశాలు జారీ చేయగా, సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఈ మేరకు విద్యార్థిలోకం సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే జోగు రామన్న చిత్రపటాలకు క్షీరాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపింది.
ఆదిలాబాద్, ఆగస్టు 22 ( నమస్తే తెలంగాణ) : ఉమ్మడి రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాగా పేరుగాంచిన ఆదిలాబాద్ ప్రత్యేక రాష్ట్రంలో అన్ని రంగాల్లో దూసుకుపోతూ అభివృద్ధి చెందిన జిల్లాలతో పోటీ పడుతున్నది. ప్రధానంగా విద్యార్థులకు ఉన్నత వి ద్యనభ్యసించేలా అవకాశాలు కల్పించడంతో పా టు యువతకు ఉపాధి కల్పించేందుకు పకడ్బందీ చర్యలు తీ సుకుంటున్నది. జిల్లాలో ఇప్పటికే ప్రభుత్వ డిగ్రీ, పీజీతో పా టు పాలిటెక్నిక్ కళాశాలలు విద్యార్థులకు అందుబాటులో ఉ న్నాయి. ఇప్పుడు విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకునేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. ఇందులో భాగంగా జిల్లా రిమ్స్ వైద్యకళాశాలలోని వివిధ విభాగాల్లో పీజీ సీట్లను మంజూరు చేయడంతో పాటు అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసొసియేట్ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్లను నియమించింది. దీంతో పాటు గతేడాది జిల్లాకు వ్యవసాయ కళాశాలను ప్రభుత్వం మం జూరు చేసింది. ఎంసెట్‌లో మార్కుల ఆధారంగా ఈ ఏడాది ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాలలో అడ్మిషన్లు జరగనున్నాయి. కళాశాల ప్రిన్సిపాల్, డీన్లను నియమించి కళాశాల, హాస్టల్ భవనాలను అందుబాటులోకి తీసుకువచ్చారు. జిల్లా విద్యార్థులతో పాటు వివిధ జిల్లాలకు చెందిన వారు కూడా ఈ కళాశాలలో చేరవచ్చు.
జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాల మంజూరు
ప్రభుత్వం జిల్లాకేంద్రంలో జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాల మంజూరు చేయడంతో ఆదిలాబాద్‌లో మరో విద్యాహారం చేరింది. కళాశాల ఏర్పాటులో భాగంగా సాంకేతిక విద్యాశాఖ జీవో ఎంఎస్ 67ను జారీ చేసింది. జేఎన్టీయూ రిజిస్ట్రార్, ఉన్నత విద్యాశాఖ కార్యదర్శులు కళాశాల ఏర్పాటులో భా గంగా తగు చర్యలు తీసుకోవాలని ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ ఆదేశాలు జారీ చేశారు. కళాశాలలో కోర్సు లు, సిబ్బంది, బడ్జెట్ వివరాలను త్వరలో వెల్లడించనున్నట్లు ఉత్తర్వులో సూచించారు. కళాశాల ఏర్పాటుకు 20 ఎకరాల స్థలాన్ని అధికారులు సేకరించనున్నారు. ఇంజినీరింగ్ కళాశాల మంజూరపై విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో సంబురాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్, ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. బీఆర్ఎస్ టౌన్ అధ్యక్షుడు శివకుమార్, బీఆర్ఎస్వీ ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్చారి ్జసాయికుమార్, నాయకులు రఘు, సద్దాం, అజయ్, హరీశ్, రిజ్వాన్, కల్యాణ్, ఆదర్శ్ తదితరులు పాల్గొన్నారు.