సోన్, అక్టోబర్ 6 : విద్యార్థుల్లో పోషకాహార లో పాన్ని నివారించి హాజరుశాతం పెంచేందుకే సీఎం కేసీఆర్ ‘అల్పాహార’ పథకాన్ని తీసుకువచ్చారని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. మండలకేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో కలెక్టర్ వరుణ్‌రెడ్డితో కలిసి ‘సీఎం బ్రేక్‌ఫాస్ట్’ పథకాన్ని’ శుక్రవారం ప్రారంభించి విద్యార్థులకు వడ్డించిన తర్వాత వారితో కలిసి టిఫిన్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చదువుకునే పిల్లలకు పోషకాహారం అందించడం, డ్రాపౌట్లను తగ్గించడం, హాజరుశాతం పెంచడానికి ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతోందని అన్నా రు. ప్రతిరోజూ మెనూ ప్రకారం అల్పాహారం, మ ధ్యాహ్నం భోజనం పెడుతారని పేర్కొన్నారు. విద్యార్థులు కష్టపడి చదివి పాఠశాల, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. అలాగే ‘మనఊరు- మనబడి’ కార్యక్రమంలో భాగంగా పాఠశాలల్లో మౌ లిక సదుపాయలు కల్పించామన్నారు.
గతేడాది నిర్మల్ జిల్లా పదో తరగతి ఫలితాల్లో రాష్ట్రంలోనే మొదటిస్థానంలో నిలవడం గర్వంగా ఉందన్నా రు. అలాగే ట్రిపుల్ఐటీకి జిల్లా నుంచి విద్యార్థులు ఎంపికయ్యారని, ఈ ఏడాది కూడా అదే స్ఫూర్తితో 200 మంది వరకు బాగా మార్కులు తెచ్చుకొని సీట్లు సాధించాలని కోరారు. సర్కారు బడుల్లో మంచి ఫలితాలు వస్తుండడంతో అడ్మిషన్ల సంఖ్య కూడా పెరుగుతుందన్నారు. విద్యార్థులు బాగా చదివి మంచి మార్కులు సాధించాలని కలెక్టర్ వరుణ్‌రెడ్డి సూచించారు. అనంతరం గృహాలక్ష్మి పథకం కింద మంజూరైన పత్రాలను లబ్ధిదారులకు అందించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ జీవన్‌రెడ్డి, జిల్లా విద్యాశాఖాధికారి రవీందర్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ కృష్ణప్రసాద్‌రెడ్డి, గ్రామ సర్పంచ్ టీ వినోద్‌కుమార్, ఆత్మ చైర్మన్ గంగారెడ్డి, రైతుబంధు సమితి మండల కన్వీనర్ మ హేందర్‌రెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ శ్రీకాంత్‌యాదవ్, పీఆర్టీయూ అధ్యక్షుడు నరేంద్రబాబు, ఎస్టీ యూ సంఘ అధ్యక్షుడు గజేందర్, తహసీల్దార్ శివరాజ్, ఉప సర్పంచ్ దాసరి రాజేశ్వర్, నాయకులు శ్రీనివాస్‌గౌడ్, దాసరి శ్రీనివాస్, అంబేకర్ ప్రసాద్, ఆరె రాము, శానం గంగాధర్, ప్రధానోపాధ్యాయులు ఆరాధన, సురేందర్, కొత్తకాపు రాజేశ్వర్, తదితరులు పాల్గొన్నారు.
దిలావర్పూర్, అక్టోబర్ 6 : మండలంలోని కాల్వ గ్రామానికి చెందిన భూమవ్వకు సీఎం సహయనిధి కింద మంజూరైన రూ.30 వేల చెక్కును మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడి ్డ మండల నాయకులతో కలిసి బాధితురాలికి అందించారు. కార్యక్రమంలో కాల్వ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ చైర్మన్ పూజారం మహేశ్, సహకార సంఘం చైర్మన్ పీవీ రమణరెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కొమ్ముల చిన్న దేవేందర్‌రెడ్డి, నాయకులు పాల్ధే అనిల్, చిన్నయ్య, తదితరులు ఉన్నారు.
నిర్మల్ అర్బన్, అక్టోబర్ 6 : రూ.200 కోట్ల నిధులతో పట్టణంలో అభివృద్ధి పనులు చేపట్టామని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలోని శాంతినగర్ క్రాస్ రోడ్డు నుంచి దివ్యనగర్ కాలనీ వరకు రూ.40 లక్షలతో చేపడుతున్న సీసీ రోడ్డు పనులకు శుక్రవారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో పట్టణాన్ని మరింత అభివృద్ధి చేస్తానని చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, అల్లోల మురళీధర్ రెడ్డి, అల్లోల తిరుపతి రెడ్డి, నాయకులు కొండ శ్రీధర్, ముత్యం రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రాజు ఉన్నారు.