నమస్తే నెట్వర్క్, మార్చి 20 : మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో శుక్రవారం నుంచి నిర్వహించనున్న పదవ తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు విద్యా శాఖ అధికారులు తెలిపారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12. 30 గంటల వరకు పరీక్షలు జరుగతాయన్నారు. మంచిర్యాల జిల్లాలో మొత్తం 9,198 మంది రెగ్యులర్ విద్యార్థులు , గతంలో ఫెయిల్ అయిన 221 మంది వి ద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు డీఈ వో యాదయ్య తెలిపారు.
ఈ నెల 21 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకూ పరీక్షా కేంద్రాల వద్ద 163 బీఎన్ఎస్ఎస్ (144 సెక్షన్) అమలులో ఉంటుందని తెలిపా రు. పరీక్షా సమయంలో పరిసర ప్రాం తాల్లో ఇంటర్నెట్, జిరాక్స్ దుకాణాలు మూసివేసి ఉంచాలన్నారు. సందేహాలుం టే మంచిర్యాల జిల్లా కంట్రోల్ రూమ్ 7032463114 లేదా 94406 88034 లో సంప్రదించవచ్చని తెలిపారు.