CITU | తాండూర్, జూన్ 27: గ్రామపంచాయతీ ఉద్యోగ, కార్మికుల సమస్యలపై సీఐటీయూ ఆధ్వర్యంలో తలపెట్టిన చలో హైదరాబాద్ కమిషనరేట్ ఆఫీసు ముందు ధర్నాకు వెళ్లకుండా శుక్రవారం సీఐటీయూ నాయకులను తాండూర్ పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ మంచిర్యాల జిల్లా సహాయ కార్యదర్శి దాగాం రాజారాం మాట్లాడుతూ అరెస్టులతోటి ఉద్యమాలను ఆపలేరన్నారు.
గ్రామపంచాయతీ ఉద్యోగ, కార్మికుల సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు సీఐటీయూ ఉద్యమాలు చేస్తూనే ఉంటుంది అని హెచ్చరించారు. ఈ ప్రభుత్వాలు గ్రామపంచాయతీ కార్మికులను పొగడడమే తప్ప వారి సమస్యలను పట్టించుకున్న పాపాన పోవడం లేదు అన్నారు. అరెస్ట్ అయిన నాయకులు సోమ మొగిలి, వేల్పుల శంకర్, బొల్లం రాజేశం, తదితరులు ఉన్నారు.