జైపూర్ (భీమారం), జూన్ 16 : జైపూర్ మండలం ముదిగుంట గ్రామానికి దారి తప్పి వచ్చిన చుక్కల దుప్పిని కుక్కలు వెంబడించాయి. ఈ క్రమంలో గ్రామ శివారులో స్సృహతప్పి పడిపోయింది. గమనించిన గ్రామాస్తులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.
అటవీ అభివృద్ధి సంస్థ మంచిర్యాల రేంజ్ ప్లాంటేషన్ మేనేజర్ గోగు సురేశ్ కుమార్ అక్కడికి వచ్చి, గాయపడిన దుప్పికి చికిత్స అందించారు. తిరిగి అటవీ ప్రాంతంలో వదిలేశారు. గ్రామస్తులు నాగపురి రాములు, దాసరి లవన్, సారంగపల్లి రాజయ్య, పట్టెం రాజన్న, పెట్టం బన్ని, పసలోట రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.