Chittem Rammohan Reddy | రైతు భరోసా అందని రైతుకు భరోసా ఎవరు..?.. కాంగ్రెస్ సర్కారుపై మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి నిప్పులు
Chittem Rammohan Reddy | రైతు భరోసా అందడం లేదని, రైతుబీమా నిలిచిపోయిందని, విద్యుత్ సమస్యలతో సాగు చేసిన పంటలు కళ్లముందే ఎండిపోతున్నాయని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
Chittem Rammohan Reddy | ఊట్కూర్, అక్టోబర్ 17 : మక్తల్–నారాయణపేట మధ్య నాలుగు లైన్ల రహదారి నిర్మాణం అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంతోపాటు, స్థానిక సమస్యలను తెలుసుకునేందుకు మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి చేపట్టిన పాదయాత్ర ఉట్కూరు మండలంలో కొనసాగింది. పాదయాత్రలో భాగంగా శనివారం 11:30 గంటలకు మల్లేపల్లికి చేరుకున్న ఆయనకు అభిమానులు, పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. రహదారి సమస్యతోపాటు ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకుంటూ ఆయన ముందుకు సాగారు.
ఈ సందర్భంగా మహిళా కూలీలు, రైతులు చిట్టెం రామ్మోహన్‌రెడ్డిని కలిసి తమ సమస్యలను వివరించారు. రైతు భరోసా అందడం లేదని, రైతుబీమా నిలిచిపోయిందని, విద్యుత్ సమస్యలతో సాగు చేసిన పంటలు కళ్లముందే ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల కష్టాలను విన్న ఆయన కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించారు. ‘రైతు భరోసా అందని రైతుకు భరోసా ఎవరు..? కళ్లముందే పంటలు ఎండిపోతుంటే రైతన్నకు దిక్కెవరు..?’ అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
ప్రజా సమస్యలను పట్టించుకోని రేవంత్ సర్కారును గద్దె దించేందుకు పార్టీ శ్రేణులు, ప్రజలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. రాబోయేది కేసీఆర్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. నాలుగు లైన్ల రహదారి అంశం, రైతుల సమస్యలు పాదయాత్రలో ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుంటూ వాటిపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకే పాదయాత్ర చేపట్టినట్లు పార్టీ శ్రేణులు పేర్కొన్నాయి.

Read Also :
Jailer 2 | ‘జైలర్ 2’ బాక్సాఫీస్ సునామీ.. రెండు రోజుల్లోనే రూ.209 కోట్ల వసూళ్లు!
Donadl Trump: రష్యాతో లింకున్న ఆంక్షలను ఎత్తివేసిన ట్రంప్.. భారత్‌కు భారీ ఊరట
Indigo Flight | బాంబు కలకలం.. అహ్మదాబాద్ నుంచి వచ్చిన ఇండిగో విమానానికి బెదిరింపు
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chittem Rammohan Reddy | రైతు భరోసా అందని రైతుకు భరోసా ఎవరు..?.. కాంగ్రెస్ సర్కారుపై మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి నిప్పులు
Oil Price | మళ్లీ పెరిగిన ముడిచమురు ధరలు.. బ్రెంట్ క్రూడ్ ధర ఎంతంటే..!
KTR | నేను ట్రీట్మెంట్ చేయిస్తా.. బ్రెయిన్ క్యాన్సర్‌తో బాధపడుతున్న వినయ్‌కు కేటీఆర్ భరోసా.. వీడియో
Katie Zacharia: వైట్‌హౌజ్ ప్రెస్ సెక్రటరీగా 5 రోజులే.. జాబ్ వదిలేసిన కేట్ జచారియా
AKKA Teaser | కీర్తి సురేశ్ బర్త్‌డే స్పెషల్.. ‘అక్క’ యాక్షన్ ప్యాక్డ్ టీజర్ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

