Oil Price | మళ్లీ పెరిగిన ముడిచమురు ధరలు.. బ్రెంట్ క్రూడ్ ధర ఎంతంటే..!
Oil Price | ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు (Crude Oil) ధరలు మళ్లీ పెరిగాయి. సరఫరా సమస్యలు త్వరలో తీరుతాయన్న ఆశలు సన్నగిల్లడంతో బ్రెంట్ క్రూడ్ ధర (Brent Crude Price) 110 డాలర్లకు చేరువైంది.
Oil Price : ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు (Crude Oil) ధరలు మళ్లీ పెరిగాయి. సరఫరా సమస్యలు త్వరలో తీరుతాయన్న ఆశలు సన్నగిల్లడంతో బ్రెంట్ క్రూడ్ ధర (Brent Crude Price) 110 డాలర్లకు చేరువైంది. కాగా మే నెల తర్వాత ముడిచమురు ధరలు ఈ స్థాయిని తాకడం ఇదే తొలిసారి. పశ్చిమాసియా (West Asia) లో ఉద్రిక్తతలు, రష్యా-ఉక్రెయిన్ (Russia-Ukraine) మధ్య దాడులు చమురు సరఫరాపై ఆందోళనలు పెరిగేలా చేస్తున్నాయి.
దాంతో ప్రస్తుతం బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 109.69 డాలర్లు అయ్యింది. గత ముగింపుతో పోలిస్తే ఇది 3.56 శాతం అధికం. అంతర్జాతీయంగా సరఫరా పరిస్థితులు బలహీనంగా ఉండటంతో ధరలు మరింత పెరుగుతాయన్న అంచనాలు ట్రేడర్లు కొనుగోళ్లపై ఆసక్తి చూపేలా పురికొల్పుతున్నాయి. సౌదీ అరేబియాపై ఇరాన్ మద్దతున్న హౌతీ తిరుగుబాటుదారుల క్షిపణి, డ్రోన్ దాడులు కొనసాగుతున్నాయి.
మరోవైపు రష్యా, ఉక్రెయిన్ పరస్పరం ఇంధన మౌలిక సదుపాయాలపై దాడులు చేసుకుంటున్నాయి. రష్యాలోని ర్యాజాన్ చమురు శుద్ధి కర్మాగారంపై దాడి జరిగినట్లు వచ్చిన వార్తలతో అక్కడ కార్యకలాపాలు నిలిచిపోయినట్లు తెలిసింది. ఈ పరిణామాలు చమురు సరఫరాపై ఒత్తిడిని పెంచుతున్నాయి. మరోవైపు నవంబర్ 3 ఎన్నికల తర్వాత ఇరాన్‌పై ‘మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్’ వినియోగించే అవకాశాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తోసిపుచ్చలేదని న్యూస్‌మాక్స్ కథనం పేర్కొన్నది.
2026 డిసెంబర్లో బ్రెంట్ క్రూడ్ ధర 90 డాలర్లకు చేరవచ్చని గోల్డ్‌మన్ శాక్స్ అంచనా వేసింది. గతంలో వేసిన 85 డాలర్ల అంచనాను పెంచింది. పశ్చిమాసియా యుద్ధం ప్రారంభమైన ఫిబ్రవరి చివరలో బ్రెంట్ క్రూడ్ ధర సుమారు 70 డాలర్లుగా ఉంది. హర్మూజ్ జలసంధిలో రవాణాకు ఆటంకాలు ఏర్పడటంతో అది 125 డాలర్లకు పైగా దూసుకుపోయింది. ఆ తర్వాత తగ్గిన ధరలు ఇప్పుడు మళ్లీ 110 డాలర్ల స్థాయికి చేరువయ్యాయి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Oil Price | మళ్లీ పెరిగిన ముడిచమురు ధరలు.. బ్రెంట్ క్రూడ్ ధర ఎంతంటే..!
KTR | నేను ట్రీట్మెంట్ చేయిస్తా.. బ్రెయిన్ క్యాన్సర్‌తో బాధపడుతున్న వినయ్‌కు కేటీఆర్ భరోసా.. వీడియో
Katie Zacharia: వైట్‌హౌజ్ ప్రెస్ సెక్రటరీగా 5 రోజులే.. జాబ్ వదిలేసిన కేట్ జచారియా
AKKA Teaser | కీర్తి సురేశ్ బర్త్‌డే స్పెషల్.. ‘అక్క’ యాక్షన్ ప్యాక్డ్ టీజర్ విడుదల!
Aakasamlo Oka Tara | పల్లెటూరి నుంచి అంతరిక్షం వరకు.. దుల్కర్ సల్మాన్ ‘ఆకాశంలో ఒక తార’ టీజర్ రిలీజ్!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

