Katie Zacharia: వైట్‌హౌజ్ ప్రెస్ సెక్రటరీగా 5 రోజులే.. జాబ్ వదిలేసిన కేట్ జచారియా
Katie Zacharia: వైట్‌హౌజ్ ప్రెస్ సెక్రటరీ కేట్ జచారియా 5 రోజుల్లోనే ఉద్యోగానికి గుడ్‌బై చెప్పింది. తొలి మీడియా సమావేశాన్ని సరిగా ఆమె హ్యాండిల్ చేయలేదు. ఇంకా ఆమె న్యాయ డిగ్రీపై కూడా వివాదం నెలకొన్నది. దీంతో ఆమెను ఆ పోస్టు నుంచి ట్రంప్ రిలీవ్ చేసినట్లు తెలిసింది.
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అధికారి ప్రతినిధిగా కేట్ జచారియా కేవలం అయిదో రోజు పని చేశారు. వైట్‌హౌజ్ ప్రెస్ సెక్రటరీ బాధ్యతలను ఆమె వదులుకున్నారు. మాజీ ప్రెస్ సెక్రటరీ కరోలినా లివియేట్ ఆగస్టులో తప్పుకున్న తర్వాత.. ఈ మధ్యలోనే ఆ పోస్టులో కేట్ జచారియా చేరారు. కానీ ఆమె ప్రెస్ బ్రీఫింగ్ సరిగా హ్యాండిల్ చేయలేదు. ఇక ఆమె చదువుకున్న డిగ్రీ అంశంలోనూ వివాదం చెలరేగింది. దీంతో అధ్యక్షుడు ట్రంప్ ఆమెను పరోక్షంగా సాగనంపారు. 42 ఏళ్ల కేట్ జచారియా కొన్ని రోజుల క్రితం వైట్‌హౌజ్‌లో మీడియా ప్రతినిధిగా చేరారు. అమెరికా అధ్యక్షుడి తరపున ప్రతి రోజూ ఆమె దేశ ప్రజలకు సమాచారం చేరవేయాల్సి ఉంటుంది. దాదాపు రోజు బ్రీఫింగ్స్ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఆమె న్యాయపట్టా అంశంలో వివాదం చెలరేగింది. స్క్రూట్నీ చేయకుండానే కేట్కు ఉద్యోగం ఇచ్చారన్న ఆరోపణలు వచ్చాయి. దీంతో ట్రంప్ ఆకస్మిక నిర్ణయం తీసుకున్నారు. కేట్ కావాలంటే మరో జాబ్ చూసుకోవచ్చు అన్న రీతిలో ట్రంప్ స్పందించారు.
తొలి బ్రీఫింగ్లోనూ ఆమె మీడియా ప్రశ్నలను సరైన రీతిలో ఎదుర్కొలేకపోయారు. దీంతో ఆమెను సాగనంపుతూ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. కానీ అయిదు రోజుల పాటు ప్రెస్ సెక్రటరీగా పనిచేయడం గౌరవంగా భావిస్తున్నట్లు కేట్ తన ఎక్స్‌లో తెలిపారు. ట్రంప్ చాలా మృదుస్వభావి అని, అద్భుతమైన వ్యక్తి అని, అమెరికన్లు ఆయన్ను ప్రశంసిస్తారని ఆశిస్తున్నట్లు ఆమె తన వీడ్కోల సందేశంలో పేర్కొన్నారు. కేట్తో మీడియా ప్రవర్తించిన సరిగా లేదని, దీంతో ఆమె తన మైండ్ మార్చుకున్నదని ట్రంప్ చెప్పారు.
వాస్తవానికి గతంలో ట్రంప్ మీడియా బృందంలో సీనియర్ కమ్యూనికేషన్స్ అడ్వైజర్‌గా కేట్ చేశారు. ట్రుత్ సోషల్‌లో అపాయింట్మెంట్ ఆర్డర్ స్క్రీన్‌షాట్ తీసి ఆమె షేర్ చేశారు. కీలకమైన స్వింగ్ స్టేట్స్లో ప్రచారం సమయంలో ఆమె తనకు సహకరించినట్లు ట్రంప్ ఓ సందర్భంలో పేర్కొన్నారు. పెప్పర్డైన్ యూనివర్సిటీలో కేట్ న్యాయ విద్యను అభ్యసించినట్లు తెలుస్తోంది. కానీ టీవీ షోలు చేస్తున్న సమయంలోనే న్యాయవాదిగా కూడా చేసినట్లు ఆమె చెప్పుకున్నది. చైనాలో లాయర్‌గా పనిచేసినట్లు పేర్కొన్నది. అయితే అమెరికాలో బార్ ఎగ్జామ్ మాత్రం ఆమె పాస్ కాలేదు. ఈ వివాదం నేపథ్యంలో వైట్‌హౌజ్ ప్రెస్ సెక్రటరీ పోస్టు నుంచి ఆమె 5 రోజుల్లోనే తప్పుకోవాల్సి వచ్చింది.
President Trump is a kind, wonderful, gracious, thoughtful, enthusiastic, and hardworking man. I wish more Americans appreciated him. No one will ever make America great the way he has and continues to.
It was an honor to work for him. https://t.co/Tp4NizrhE2
— Katie Zacharia (@KatieZacharia) October 17, 2026
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Katie Zacharia: వైట్‌హౌజ్ ప్రెస్ సెక్రటరీగా 5 రోజులే.. జాబ్ వదిలేసిన కేట్ జచారియా
AKKA Teaser | కీర్తి సురేశ్ బర్త్‌డే స్పెషల్.. ‘అక్క’ యాక్షన్ ప్యాక్డ్ టీజర్ విడుదల!
Aakasamlo Oka Tara | పల్లెటూరి నుంచి అంతరిక్షం వరకు.. దుల్కర్ సల్మాన్ ‘ఆకాశంలో ఒక తార’ టీజర్ రిలీజ్!
Road accident | ఘోరం.. అదుపుతప్పి లోయలోపడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం..!
Keerthy Suresh | ‘లతా రెడ్డి’గా కీర్తి సురేశ్ కొత్త అవతారం.. సంక్రాంతి బరిలో వెంకీ సినిమా!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

