Donadl Trump: రష్యాతో లింకున్న ఆంక్షలను ఎత్తివేసిన ట్రంప్.. భారత్‌కు భారీ ఊరట
Donadl Trump: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రష్యాతో లింకున్న ఆంక్షలను ఎత్తివేస్తూ ఆయన ఎగ్జిక్యూటివ్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో భారత్, చైనా దేశాలకు భారీ ఊరట లభించింది.
న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్(Donadl Trump) సంచలన నిర్ణయం తీసుకున్నారు. రష్యాతో లింకున్న ఆంక్షలను ఎత్తివేస్తూ ఆయన ఎగ్జిక్యూటివ్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో భారత్, చైనా దేశాలకు భారీ ఊరట లభించింది. రష్యా వద్ద భారీ మొత్తంలో ఇంధనం కొనుగోలు చేసే దేశాలపై 100 శాతం టారిఫ్ విధిస్తానని ట్రంప్ హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గత నెలలో గ్రహం యాక్ట్‌ను కూడా అమెరికా కాంగ్రెస్‌లో పాస్ చేశారు. అయితే ఆ చట్టం అమలు చేయడానికి 30 రోజుల గడువు సమీపించడంతో.. ట్రంప్ అనూహ్యంగా ఆ చట్టాన్ని రద్దు చేస్తూ ఆదేశాలు ఇచ్చారు. దేశ ప్రయోజనాలను ఉద్దేశించి ఆంక్షలను ఎత్తివేస్తున్నట్లు శుక్రవారం జారీ చేసిన ఆదేశాల్లో ట్రంప్ పేర్కొన్నారు.
ఆదేశాలకు సంబంధించిన సర్టిఫికేట్‌ను అమెరికా కాంగ్రెస్‌కు సమర్పించినట్లు తెలిపారు. సెప్టెంబర్ 16వ తేదీన గ్రహం యాక్ట్‌ను పాస్ చేశారు. రెండు రోజుల తర్వాత ఆ యాక్ట్‌ను చట్టంగా మారుస్తూ ట్రంప్ సంతకం చేశారు. అయితే ఆ చట్టం ప్రకారం రష్యా నుంచి ఇంధనం కొనుగోలు చేస్తున్న దేశాలపై వంద శాతం టారిఫ్ విధించాలనుకున్నారు. కానీ చట్టం అమలులోకి రావడానికి 30 రోజుల గడవు దగ్గరపడడంతో.. అనూహ్యంగా ట్రంప్ ఆ యాక్ట్‌ను రద్దు చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- china
- Donadl Trump
- India
- Russia
RELATED ARTICLES
తాజా వార్తలు
Donadl Trump: రష్యాతో లింకున్న ఆంక్షలను ఎత్తివేసిన ట్రంప్.. భారత్‌కు భారీ ఊరట
Japan | జపాన్‌లో సాయంత్రం సమయంలో ఆహార పదార్థాలపై రాయితీ.. ఎందుకో తెలుసా..?
Mahabubnagar | యువకుల కార్ల రేసింగ్ సరదా.. మహిళ ప్రాణం బలి!
Saluru | ఎన్నికల కోసం పెళ్లి.. చివరికి సీటు జనసేనకు! టీడీపీ నేతకు షాక్ మీద షాక్!
రూ.280 కోట్ల పనులకు మోక్షమెప్పుడో.. రోడ్ల పనుల డిమాండ్‌తో మక్తల్–నారాయణపేట రహదారిపై చిట్టెం పాదయాత్ర..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

