పెంబి, నవంబర్ 1 : ఇందిరమ్మ పథకం కింద మంజూరైన ఇంటి పిల్లరు గుంతలో పడి చిన్నారి పుష్ప(5) మృత్యువాత పడింది. కుటుంబ సభ్యులు, స్థానికుల వివరాల ప్రకారం.. నిర్మల్ జిల్లా పెంబి మండలంలోని వేణునగర్కు చెందిన ఆత్రం రాము-రేణు కలకు పక్షం రోజుల క్రితం ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. కాంట్రాక్టర్కు అప్పగించి పునాది తీసి పిల్లర్లు వేశారు.
ఈ క్రమంలో రేణుక కూతురు పుష్పను ఇందిరమ్మ ఇంటి నిర్మాణం జరుగుతున్న ఇంటి పక్కనే ఉన్న అంగన్వాడీ కేంద్రంలో ఉదయం వదిలి వ్యవసాయ పనులకు వెళ్లింది. అంగన్వాడీ కేంద్రం నుంచి చిన్నారి పుష్ప ఆడుకుంటూ మధ్యాహ్నం ఇంటికి వెళ్లింది. ఈ క్రమంలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణం కోసం తీసిన గుంతలో పడింది. రెండు రోజులుగా వర్షాలు కురవడంతో గుంతల్లో నీరు నిలిచి ఉండ డంతో మృత్యువాత పడింది. సాయంత్రం కుటుంబ సభ్యులు పాపను వెతుకగా గుంత లో కనిపించింది. అప్పటికే మృతి చెందింది. చిన్నారి మృతితో విషాదం అలుముకున్నది.