చెన్నూర్, అక్టోబర్ 12 : చెన్నూర్ ప్రగతికి కేరాఫ్‌గా నిలుస్తున్నది. ఇప్పటికే వేలాది కోట్లతో అనేక కార్యక్రమాలు చేపట్టగా ఆదర్శంగా నిలుస్తుండగా, ఇటీవల బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పురపాలక, ఐటీశాఖ మంత్రి కేటీఆర్, రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు వేర్వేరుగా పర్యటించి పెద్ద ఎత్తున్న అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయడం ప్రాధాన్యం సంతరించుకున్నది. అక్టోబర్ 1న మందమర్రి మండలంలోని సండ్రోస్పల్లిలో రూ. 500 కోట్లతో నిర్మించే ఆయిల్‌పాం ఫ్యాక్టరీకి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. మందమర్రి పట్టణంలో రూ.కోటితో నిర్మించిన కేసీఆర్ మల్టీపర్పస్ కమ్యూనిటీ భవనాన్ని ప్రారంభించారు. మందమర్రి పట్టణంలో రూ. 2 కోట్లతో నిర్మించిన సమ్మక్క-సారలమ్మ మహిళా భవనాన్ని ప్రారంభించారు. మందమర్రి పట్టణంలో రూ. 5 లక్షలతో నిర్మించిన బతుకమ్మ గ్రౌండ్‌ను ప్రారంభించారు. మందమర్రి పట్టణంలో రూ 29.68కోట్లతో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇండ్లను ప్రారంభించారు. మందమర్రి పట్టణంలో రూ. 3.30 కోట్లతో నిర్మించిన సెంట్రల్ లైటింగ్‌ను ప్రారంభించారు. మందమర్రి పట్టణంలో 13 వేల గృహాలకు తాగునీరు అందించేందుకు రూ. 40 కోట్లతో నిర్మించిన మిషన్ భగీరథ పథకాన్ని ప్రారంభించారు. మందమర్రి పట్టణంలో సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా మంజూరు చేసిన రూ. 25 కోట్లు, మున్సిపల్‌శాఖ ద్వార మంజూరైన రూ,20 కోట్లతో చేపట్టే పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
మందమర్రి-రామకృష్ణాపూర్ పట్టణాల మధ్యలో కాళీనగర్ వద్ద పాలవాగుపై రూ. 8 కోట్లతో నిర్మించే బ్రిడ్జికి శంకుస్థాపన చేశారు. రామకృష్ణాపూర్ పట్టణంలో రూ 15.65 కోట్లతో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇండ్లను ప్రారంభించారు. రామకృష్ణాపూర్ మున్సిపాలిటీలోని గాంధారి వనం వద్ద తొలివిడుత రూ. 18కోట్లతో 250 ఎకరాల్లో నిర్మించే కేసీఆర్ అర్బన్ పార్క్ పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఆహ్వానం మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అక్టోబర్ 7న చెన్నూర్ పట్టణంలో పర్యటించారు. చెన్నూర్ పట్టణంలో రూ. 10కోట్లతో కొత్తగా నిర్మించిన 50 పడకల దవాఖాన నూతన భవనాన్ని ప్రారంభించారు. పట్టణంలో రూ. 2కోట్లతో నూతనంగా నిర్మించే అధునాతన ధోబీఘాట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. చెన్నూర్ మండలంలోని సుద్దాల వాగుపై రూ. 15కోట్లతో నిర్మించిన వంతెనను ప్రారంభించారు. రూ. 50లక్షలతో చేపట్టే మినీ స్టేడియం అభివృద్ధి పనులకు, రూ. 3కోట్లతో చేపట్టే డబుల్‌బెడ్ రూం ఇండ్ల అదనపు పనులకు, రూ. 25లక్షలతో మధునపు పోచమ్మ ఆలయం వద్ద భక్తుల సౌకర్యార్థం నిర్మించే మరుగు దొడ్ల నిర్మాణం పనులకు, రూ 4.50 కోట్లతో చేపట్టే అనంతయ్య కుంట మినీ ట్యాంకు బండ్ నిర్మాణానికి, రూ. 2కోట్లతో కుమ్మరిబొగుడ, బొక్కలకుంట వాడల్లో నిర్మించే రెండు కమ్యూనిటీ భవనాల నిర్మాణాలకు, రూ. 65 లక్షలతో పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసే హైమాస్ట్ లైట్ల ఏర్పాటు పనులకు, రూ. 20 లక్షలతో నిర్మించే కబ్రస్తాన్ ప్రహారీ నిర్మాణానికి, రూ కోటితో పట్టణంలో ఏర్పాటు చేసే పిల్లల పార్కు,
ఓపెన్ జిమ్‌లకు, రూ 1.70 కోట్లతో సీతారం తోట నుంచి ఆర్టీసీ బస్‌డిపో వరకు రోడ్డు నిర్మాణానికి, రూ.50 లక్షలో చేపట్టే వేంకటేశ్వరస్వామి ఆలయం పనులకు, రూ.కోటితో చేపట్టే అంబేద్కర్ భవనం పనులకు, రూ.50 లక్షలతో నిర్మించే మిషన్ భగీరథ కార్యాలయం పనులకు, రూ 1.90 కోట్లతో 7వ వార్డులో చేపట్టే అంతర్గత రహదారులు, మురుగు కాలువల నిర్మాణం పనులకు, రూ 50 లక్షతో 13వ వార్డులో చేపట్టే అంతర్గత రహదారుల నిర్మాణానికి, రూ. 35 లక్షలతో 2,9 వార్డుల్లో చేపట్టే మురుగు కాలువల నిర్మాణం, రూ. 20 లక్షలతో 4వ వార్డులో నల్లగొండ పోచమ్మ వాడ ప్రభుత్వ పాఠశాల వరకు చేపట్టే రోడ్డు నిర్మాణం, రూ.40 లక్షలతో 4 వార్డులోని పంబాల వాడలో నిర్మించే రోడ్డు నిర్మాణం, రూ.50 లక్షలతో 11వ వార్డులో నిర్మించే రోడ్డు నిర్మాణం, రూ. 30లక్షలతో 16వ వార్డులో చేపట్టే రోడ్డు నిర్మాణం, రూ. 30 లక్షలతో 15వ వార్డులో చేపట్టే రోడ్డు నిర్మాణం, రూ.20 లక్షలతో 8వ వార్డులోని పెద్దమ్మ ఆలయం ప్రహరీ నిర్మాణానికి, రూ. 30 లక్షలతో 11వ వార్డులో చేపట్టే రోడ్డు నిర్మాణం, రూ. 5 లక్షలతో 10వ వార్డులో చేపట్టే రోడ్డు నిర్మాణం, రూ. 10 లక్షలతో 10వ వార్డులో చేపట్టే రోడ్డు నిర్మాణం, రూ. 20 లక్షలతో 4వ వార్డులో చేపట్టే రోడ్డు నిర్మాణం, రూ. 50 లక్షలతో 14వ వార్డులో చేపట్టే రోడ్డు నిర్మాణం, రూ. 25 లక్షలతో 1వ వార్డులో చేపట్టే రోడ్డు నిర్మాణం, రూ. 25 లక్షలతో 3వ వార్డులో చేపట్టే రోడ్డు నిర్మాణం, రూ. 40 లక్షలతో కస్తూర్బా పాఠశాల వరకు నిర్మించే రోడ్డు నిర్మాణం, రూ. 1.50 కోట్లతో విద్యుత్ కార్యాలయం వద్ద నిర్మించే షాపింగ్ కాంప్లెక్స్ పనులకు మంత్రి హరీశ్‌రావు శంకుస్థాపన చేశారు. అలాగే రూ. 28కోట్ల టీయూఎఫ్ఐడీసీ నిధులతో పట్టణంలో చేపట్టే పలు అభివృద్ధి పనులను మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. అక్టోబర్ 4న చెన్నూర్ రెవెన్యూ డివిజన్‌తో పాటు అస్నాద్, పారుపల్లి రెండు కొత్త మండలాలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ విప్ బాల్క సుమన్ కూడా నియోజకవర్గంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.
అక్టోబర్ 5న చెన్నూర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శాట్స్ చైర్మన్ అంజనేయగౌడ్తో కలసి యువతకు 23క్రీడా సామాగ్రి గల 178 క్రీడా కిట్లను పంపిణీ చేశారు. అక్టోబర్ 6న మందమర్రి పట్టణంలోని రామాలయం ఏరియా వద్ద రూ 4.09 కోట్లతో సింగరేణి ఏరియాలోని 1,2, 3వ జోన్ల పరిధిలో గల బీటీ రోడ్ల పనులకు భూమి చేశారు. రామకృష్ణాపూర్ పట్టణంలోని సూపర్ బజార్ ఏరియాలో రూ 3.78 కోట్లతో నిర్మించే బీటీ రోడ్ల పనులకు భూమి చేశారు. మందమర్రి పట్టణంలోని ఫిల్టర్ బెడ్ ఏరియాలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అందించే (పౌష్టికాహారం) సీఎం బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని ప్రారంభించారు. మందమర్రి, క్యాతన్‌పల్లి పట్టణాల్లో మహిళలకు తెలంగాణ ప్రభుత్వం దసరా కానుకగా అందిస్తున్న బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. అనంతరం యువకులకు కేసీఆర్ క్రీడా సామగ్రిని పంపిణీ చేశారు. సెప్టెంబర్ 4న మందమర్రి పట్టణంలోని 11వ వార్డులో రూ 1.50 లక్షలతో ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైట్లను ప్రారంభించారు. మందమర్రి పట్టణంలో 11వ వార్డు లో నిర్మించే పోచమ్మ తల్లి ఆలయానికి భూమి పూజ చేశారు. సెప్టెంబర్ 17న రామకృష్ణాపూర్ మున్సిపాలిటీలో శ్రీనివాసగార్డెన్ నుంచి గాంధారి మైసమ్మ ఆలయం వరకు రూ. 22కోట్లతో మూడు కిలోమీటర్ల మేర నూతనంగా నిర్మించనున్న నాలుగు లేన్ల ప్రధాన రహదారి, సెంట్రల్ లైటింగ్ ప నులకు శంకుస్థాపన చేశారు. ఈ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల్లో ఎంపీ బోర్లకుంట వెంకటేశ్‌నేతకాని, ఎమ్మెల్సీ దండె విఠల్ పాల్గొన్నారు. కాగా, చెన్నూర్ నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే విప్ బాల్క సుమన్‌ను మరోసారి గెలిపిస్తాయని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటుండగా, బీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ కనిపిస్తున్నది.