జైపూర్, జనవరి 4 : జైపూర్ విద్యుత్ కేంద్రంలో జరిగిన డీజిల్ చోరీ ఘటనలో పలువురిని గుర్తించి కేసు నమో దు చే సినట్లు ఎస్ఐ రామకృష్ణ తెలిపారు. ఎస్టీపీపీ జూనియర్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ ఫిర్యాదు మేరకు గ్లోబస్ కంపెనీకి చెం దిన కేబుల్ ఆపరేటర్ లంక రవికుమార్ కారులో డిసెంబర్ 31న డీజిల్ తరలిస్తుండగా, సీఐఎస్ఎఫ్ సిబ్బంది పట్టుకున్నారు.
విచారించగా ప్రశాంత్, స్వామి, రాజేశ్, అర్జున్, అ రవింద్ కొమురయ్య, వెంకటేశ్ నిలిపి ఉంచిన వాహనాల్లోని డిజిల్ చోరీ చేసి తరలిస్తున్నట్లు ఒప్పుకున్నారు. 3న మరోసారి హౌస్ కీపింగ్ వ్యక్తులు గుర్తించి అధికారులకు సమాచారం అందించగా, విచారణ చేపట్టినట్లు తెలిపారు.