జైనథ్, నవంబర్ 13 : బీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ హయాంలోనే గ్రామాల్లో అభివృద్ధి సాధ్యపడిందని ఎమ్మెల్యే అభ్యర్థి జోగు రామన్న అన్నారు. ఆదివారం బేల మండలంలోని సాపోనాల, మారుతిగూడ, చాంద్పల్లి, భవానిగూడ, బాలుగూడ, పిట్గావ్, చేప్రాల, సోన్‌కాస్, గణేశ్‌పూర్ గ్రామాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జోగు రామన్న ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామగ్రామాన జోగు రామన్నకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. మహిళలు వీర తిలకందిద్ది స్వాగతం పలికారు. చాంద్పల్లి గ్రామంలో ఎమ్మెల్యే అభ్యర్థి జోగు రామన్నకు గుస్సాడీ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయన సమక్షంలో బీఆర్ఎస్లో చేరగా వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి జోగు రామన్న మాట్లాడుతూ 65 ఏళ్లకు పైగా పాలించిన కాంగ్రెస్, ప్రస్తుతం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆదివాసీ గ్రామాల అభివృద్ధిని పూర్తిగా విస్మరించాయని అన్నారు. ఆదివాసీ గ్రామాలకు రహదారి, వైద్యం, శుద్ధజలం సరఫరా వంటి మౌలిక వసతులను కల్పించేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం విశేష కృషి చేసిందని అన్నారు. రానున్న ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి అభివృద్ధికి పట్టం కట్టాలని కోరారు. కార్యక్రమంలో జిలా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రౌత్ మనోహర్, జడ్పీటీసీ అక్షిత పవార్, సర్పంచ్ జంగ్ షావ్, మండలాధ్యక్షుడు ప్రమోద్ రెడ్డి, నాయకులు గంభీర్ ఠాక్రే, సతీశ్ పవార్, సుదర్శన్, సంతోష్ పటేల్, సోనేరావ్, సుదర్శన్ పాల్గొన్నారు.
బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను పాతరవేయాలి
రైతులను మోసం చేస్తున్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను పాతరవేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జోగు రామన్న అన్నారు. సోమవారం మండలంలోని కౌఠ, సాంగ్వి, సాంగ్వి(కే), పెండల్వాడ, సావాపూర్, ఆకుల బాలాపూర్ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే అభ్యర్థి జోగు రామన్నకు మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికి పూల వర్షం కురిపిస్తూ వారి అభిమానాన్ని చాటుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఎన్నికల కోడ్ సాకు చూపిస్తూ రైతుబంధు నిలిపియాలంటూనే మళ్లీ అదే రైతుల వద్దకు ఓట్లు ఏ ముఖం పెట్టుకొని అడగడానికి వస్తున్నారని, రైతులపై మోటర్లు ఎక్కించి మరి చంపించిన వారిని నిలదీయాలని అన్నారు. సంక్షేమ పథకాల్లో టాప్‌లో ఉన్న తెలంగాణ రానున్న ఏప్రిల్ నుంచి మరిన్ని సంక్షేమ పథకాలు ప్రజలకు అందించనుందన్నారు. మూడోసారి కేసీఆర్‌ను ముఖ్యమంత్రిని చేసి దశల వారీగా సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికీ అందించడం జరుగుతుందని పేర్కొన్నారు.
భారీగా బీఆర్ఎస్లో చేరికలు
భోరజ్ గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అలిసెట్టి రాజారెడ్డి అనుచరులతో కలిసి బీఆర్ఎస్ పార్టీలో చేరగా వారికి ఎమ్మెల్యే అభ్యర్థి జోగు రామన్న గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో ఎంపీపీ మార్సెట్టి గోవర్ధన్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తుమ్మల వెంకట్ రెడ్డి, ఉపాధ్యక్షుడు విజయ్‌కుమార్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ యాసం నర్సింగ్‌రావ్, ప్రభాకర్, నాయకులు ఊశన్న, రైతుబంధు సమితి మండల కన్వీనర్ ఎస్ లింగారెడ్డి, సర్పంచ్‌లు విఠల్, సురేశ్, చందమమత, జక్కుల వినోద్ యాదవ్, పీఏసీఎస్ చైర్మన్ పురుషోత్తం యాదవ్, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, కార్యకర్తలు పాల్గొన్నారు.